Kim Jong Un: అలా చేస్తే.. మీ ఉపగ్రహాలను ధ్వంసం చేస్తాం: అమెరికాకు కిమ్ హెచ్చరిక

‘మా జోలికి వస్తే ఊరుకోం’ అని అమెరికాను ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌(Kim Jong Un) హెచ్చరించారు.  

Updated : 02 Dec 2023 18:59 IST

ప్యాంగ్యాంగ్‌: ఉత్తరకొరియా(North Korea) నియంత కిమ్ జోంగ్‌ ఉన్‌(Kim Jong Un).. అగ్రదేశం అమెరికా(USA)కు హెచ్చరికలు పంపారు. తమ జోలికి వస్తే ఊరుకునేది లేదన్నారు. ఇటీవల ఉత్తర కొరియా నిఘా ఉపగ్రహాన్ని ప్రయోగించిన నేపథ్యంలో ఈ ప్రకటన వచ్చింది. ఈ మేరకు కొరియా రక్షణ శాఖ స్పందించింది. 

‘మా అంతరిక్ష ఆస్తులపై వాషింగ్టన్‌ దాడులకు ప్రయత్నిస్తే.. మేం ఆ దేశ నిఘా శాటిలైట్లను ధ్వంసం చేస్తాం. అలాంటి చర్యలను యుద్ధ ప్రకటనగా భావిస్తాం’ అని అమెరికాకు ఉ.కొరియా హెచ్చరికలు చేసింది. నిఘా ఉపగ్రహాన్ని భూకక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు కిమ్‌ ప్రభుత్వం గతంలో రెండుసార్లు విఫలయత్నాలు చేసింది. అయితే గత నెల ప్రారంభంలో రష్యా(Russia) సహకారంతో శాటిలైట్‌ ప్రయోగాన్ని విజయవంతం చేసింది.

‘ఆ పంచ్‌ దెబ్బలకు రూ.3 కోట్లు ఇవ్వండి’.. మైక్‌ టైసన్‌ను డిమాండ్‌ చేసిన బాధితుడు

గతవారం ఈ ప్రయోగం జరగ్గా.. కిమ్(Kim) లాంచింగ్‌ను వీక్షించారు. ఈ ప్రయోగంతో దక్షిణ కొరియా, జపాన్‌, అమెరికా దేశాలు తమ సైన్యాన్ని అప్రమత్తం చేశాయి. అలాగే రోదసీ ప్రయోగాల ద్వారా ఎదురయ్యే ముప్పును వివిధ మార్గాల ద్వారా ఎదుర్కొంటామని ఉ.కొరియా ప్రయోగాన్ని ఉద్దేశించి అమెరికా స్పందించింది. ఈ క్రమంలోనే కిమ్ దేశం నుంచి ఈ స్పందన వచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు