Imran Khan: హత్య కేసులో ఇమ్రాన్‌ఖాన్‌కు సుప్రీం నోటీసులు

హత్య కేసులో విచారణకు హాజరు కావాల్సిందిగా పాక్‌ మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్‌ ఖాన్‌కు అక్కడి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.

Published : 20 Jul 2023 17:00 IST

ఇస్లామాబాద్‌: సీనియర్‌ న్యాయవాది హత్య కేసులో పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఏ ఇన్సాఫ్‌ (PTI) అధినేత, పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు (Imran Khan) ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం (Supreme Court) నోటీసులు జారీ చేసింది. జులై 24న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. పాక్‌ సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది అబ్దుల్‌ రజాక్‌ షార్‌ హత్య వెనుక ఇమ్రాన్‌ఖాన్‌ ఉన్నారనేది ప్రధాన ఆరోపణ. ఈ కేసుపై ఇవాళ ఆ దేశ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

చీతాల మృత్యువాత.. కేంద్రంపై సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం

ఇమ్రాన్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది లటిఫ్‌ కోశా వాదనలు వినిపించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాయింట్‌ ఇన్వెస్టిగేషన్‌ బృందం కేసును తప్పుదోవ పట్టిస్తోందని, పాక్‌ చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం నిందితులు తొలుత కోర్టు ఎదుట లొంగిపోవాలని, ఆ తర్వాత విచారణలో దోషి ఎవరో తేలుతుందని వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను జులై 24కి వాయిదా వేసింది.

జూన్‌ 7న జరిగిన అబ్దుల్‌ రజాక్‌ షార్‌ హత్య వెనుక ఇమ్రాన్‌ హస్తముందని ఆరోపిస్తూ జమీల్‌ కాకర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. క్వెట్టాలోని ఎయిర్‌పోర్టు రోడ్డులో అబ్దుల్‌ రజాక్‌ వెళ్తుండగా.. కొందరు దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో రజాక్‌ ప్రాణాలు కోల్పోయారు. దీంతో పాటు మరో రెండు కేసుల్లో అరెస్టు కాకుండా జూన్‌ 21న ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రొటెక్టివ్‌ బెయిల్‌ను తెచ్చుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని