India - UK on Vintage Car: వింటేజ్‌ కారులో కుటుంబాన్ని వెంటేసుకుని!

అహ్మదాబాద్‌కు చెందిన నిర్మాణరంగ పరికరాల తయారీ వ్యాపారి అరుదైన వింటేజ్‌ కారులో సాహసోపేత రోడ్డు యాత్రకు శ్రీకారం చుట్టారు.

Updated : 19 Aug 2023 10:00 IST

భారత్‌ నుంచి బ్రిటన్‌కు బయలుదేరిన గుజరాత్‌ వ్యాపారి

లండన్‌: అహ్మదాబాద్‌కు చెందిన నిర్మాణరంగ పరికరాల తయారీ వ్యాపారి అరుదైన వింటేజ్‌ కారులో సాహసోపేత రోడ్డు యాత్రకు శ్రీకారం చుట్టారు. దమన్‌ ఠాకుర్‌(50) తన తండ్రి(75), కుమార్తె(21), మిత్రుడితో కలిసి తమ కుటుంబానికి చెందిన ‘లాల్‌పరీ’ అనే పేరున్న 1950 ఎంజీ వైటీ వింటేజ్‌ కారులో బ్రిటన్‌కు బయలుదేరారు. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 76 ఏళ్లు పూర్తయిన సందర్భానికి గుర్తుగా 73 ఏళ్ల క్రితం తమ కారు తయారైన ఆగ్నేయ ఇంగ్లాండ్‌లోని అబింగ్డన్‌లోని ఎంజీ కర్మాగారం వరకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు 16 దేశాల మీదుగా 12 వేల కిలోమీటర్ల యాత్రను మంగళవారం ప్రారంభించారు. తొలుత సర్దార్‌ సరోవర్‌లోని సర్దార్‌ వల్లబ్‌భాయ్‌ పటేల్‌ విగ్రహాన్ని దర్శించుకుంటారు. తర్వాత ముంబయికి చేరుకుని, అక్కడి నుంచి దుబాయికి ఓడలో వెళతారు. అక్కడి నుంచే అధికారిక యాత్ర మొదలవుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని