Iran: అమెరికా దూరంగా ఉండు.. నెతన్యాహు ఉచ్చులో పడొద్దు..: ఇరాన్‌ మెసేజ్‌

తమ సైన్యాధికారుల మృతికి ఇజ్రాయెల్‌ కారణమని ఆరోపిస్తోన్న ఇరాన్‌.. తదుపరి చర్యలకు సిద్ధమవుతోందన్న వార్తలతో మధ్యప్రాచ్యం మొత్తం నివురుగప్పిన నిప్పులా ఉంది. ఈ క్రమంలో అమెరికా బలగాలు హై అలర్ట్‌లో ఉన్నాయి.  

Updated : 06 Apr 2024 12:02 IST

ఇంటర్నెట్‌డెస్క్: సిరియా రాజధాని డమాస్కస్‌లోని ఇరాన్‌ (Iran) రాయబార కార్యాలయ కాన్సులర్‌ విభాగంపై జరిగిన గగనతల దాడిలో ఏడుగురు అధికారులు మృతి చెందిన సంగతి తెలిసిందే. వారిలో ఇరాన్‌ సైన్యానికి చెందిన ఉన్నతాధికారులు ఉన్నారు. ఇందుకు ప్రతిగా ఇజ్రాయెల్‌ (Israel)పై ఆ దేశం ఏక్షణమైనా దాడి చేయొచ్చనే అంచనాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ ప్రతిదాడి విషయంలో అమెరికా(USA) దూరంగా ఉండాలని తాము అడిగినట్లు ఇరాన్‌ వెల్లడించింది. ఈ మేరకు వాషింగ్టన్‌కు సందేశం పంపినట్లు తెలిపింది.(Israel-Hamas Conflict)

‘‘అమెరికా జాగ్రత్త..  నెతన్యాహు ఉచ్చులో పడొద్దు. ఈ విషయంలో మీరు దూరంగా ఉండాలి.. అలా అయితే మీపై దాడి జరగదు’’ అని యూఎస్‌కు వెల్లడించినట్లు ఇరాన్ ఉన్నతాధికారి మహమ్మద్‌ జంషిది ఒకరు ఎక్స్(ట్విటర్) వేదికగా వెల్లడించారు. అయితే ఈ పోస్టుపై అగ్రరాజ్యం నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.

హెచ్చరించిన అమెరికా.. దిగొచ్చిన ఇజ్రాయెల్‌

ఈ ఉద్రిక్తతల వేళ.. అమెరికా హై అలర్ట్‌లో ఉందని అధికారిక వర్గాలను ఉటంకిస్తూ అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఇజ్రాయల్‌లో దాడి జరగొచ్చని, అది నిఘా, మిలిటరీ స్థావరాల లక్ష్యంగా ఉండొచ్చని జో బైడెన్ ప్రభుత్వం అంచనా వేస్తోంది. అలాగే మధ్యప్రాచ్యంలోని తన స్థావరాలను భద్రంగా ఉంచేందుకు తగిన చర్యలు తీసుకుంటోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని