Stores Loot: ఫ్లాష్‌ మాబ్‌ తరహాలో వచ్చి.. యాపిల్‌ సహా అనేక స్టోర్‌లను లూటీ చేసి..!

ఫ్లాష్‌ మాబ్‌ తరహాలో వచ్చిన వందలాదిమంది యువకులు అనేక స్టోర్‌లను లూటీ చేసిన ఘటన అమెరికాలోని సంచలనం రేపింది.

Updated : 27 Sep 2023 16:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఫ్లాష్‌ మాబ్‌ (Flash mob) తరహాలో వచ్చిన కొందరు యువకులు అనేక స్టోర్‌లను లూటీ (Stores loot) చేసిన ఘటన అమెరికాలో సంచలనం రేపింది. ఫిలడెల్ఫియాలోని యాపిల్‌, ఫూట్‌లాకర్‌, లులూలెమన్‌లతోపాటు అనేక స్టోర్లపైనా దాడులు చేసి అంతా దోచుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. పలువురిని అరెస్టు చేశారు.

అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరంలో వందల మంది యువకులు ఒకేసారి దోపిడీకి తెగబడటం (Philadelphia loot) కలకలం రేపింది. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో దాదాపు వంద మంది యువతీ యువకులు మాస్కులు, హుడీలు ధరించి సిటీ సెంటర్లోని అనేక స్టోర్లపై దోపిడీకి తెగబడ్డారు. ఫ్లాష్‌ మాబ్ తరహాలో వచ్చిన మూక.. స్టోర్లన్నీ లూటీ చేశారు. అడ్డుకున్న సెక్యురిటీ సిబ్బందిపై దాడి చేసి పారిపోయారు. ఈ క్రమంలో ఓ యాపిల్‌ స్టోర్‌లోకి (Apple Store) ప్రవేశించి.. ఐఫోన్లు, ఐపాడ్‌లతోపాటు ఇతర వస్తువులన్నింటినీ దోచుకుంటున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

26 ఏళ్ల టెక్‌ సీఈవో.. నేరగాడి చేతిలో హత్యకు గురై..!

ఫిలడెల్ఫియాలో సంచలనం రేపిన ఈ ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇప్పటి వరకు దాదాపు 20 మందిని అరెస్టు చేశారు. వీరిలో కొంతమంది నుంచి ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే, వీరంతా సోషల్‌ మీడియాలో సమన్వయంతోనే ఈ దోపిడీకి పన్నాగం పన్నినట్లు కనిపిస్తోందని నగర ఇంఛార్జ్‌ కమిషనర్‌ జాన్‌ స్టాన్‌ఫర్డ్‌ పేర్కొన్నారు. నగరం మొత్తం కార్లలో తిరుగుతూ దుకాణాల్లోకి చొరబడ్డారని పేర్కొన్నారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని