IND vs SL: ఆసియా కప్ ఫైనల్‌.. శ్రీలంక నడ్డి విరిచిన టీమ్‌ఇండియా పేసర్ సిరాజ్‌

కొలంబో వేదికగా జరుగుతున్న ఆసియా కప్ ఫైనల్‌లో (Asia Cup 2023) శ్రీలంక బ్యాటర్లు చేతులెత్తేశారు. భారత బౌలర్ల దెబ్బకు శ్రీలంక 15.2 ఓవర్లలో 50 పరుగులకే కుప్పకూలింది. టీమ్‌ఇండియా పేసర్ మహమ్మద్‌ సిరాజ్‌ (6/21) ఒకే ఓవర్‌లో నాలుగు వికెట్లు తీసి శ్రీలంకను దెబ్బ కొట్టాడు. ఇదే క్రమంలో వన్డేల్లో తన అత్యుత్తమ గణాంకాలను నమోదు చేసుకున్నాడు. ఆసియా కప్‌లో అతడికిదే బెస్ట్‌ బౌలింగ్‌ కావడం విశేషం. 

Updated : 17 Sep 2023 18:16 IST
Tags :

మరిన్ని