Super Catch: బాల్‌ బాయ్‌ సూపర్‌ క్యాచ్‌.. ఫీల్డర్‌తో కలిసి సంబరాలు!

క్రికెట్‌ మ్యాచ్‌లో తమ అభిమాన ఆటగాడు అద్భుతమైన క్యాచ్‌ పడితే స్టేడియంలోని ప్రేక్షకులు కేరింతలు కొట్టడం సహజమే. కానీ, ఏ జట్టుతోనూ సంబంధం లేని ఓ బాల్‌ బాయ్‌ పట్టిన క్యాచ్‌కు ఆటగాళ్లు సహా స్టేడియంలోని ప్రేక్షకులంతా ఫిదా అయ్యారు. పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌లో ఇస్లామాబాద్‌ యునైటెడ్‌, పేషావర్‌ జల్మీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ సంఘటన జరిగింది. ఇస్లామాబాద్‌ పేసర్‌ ఫహీమ్‌ అష్రఫ్‌ వేసిన బంతిని అమర్‌ జమాల్‌ భారీ షాట్‌గా మలిచాడు. గాల్లోకి ఎగిరిన ఆ బంతిని బౌండరీ బయట నిలుచున్న బాల్‌ బాయ్‌ అద్భుతంగా ఒడిసి పట్టాడు. అతడి ప్రయత్నానికి ముగ్ధుడైన న్యూజిలాండ్‌ స్టార్‌ ఆటగాడు కొలిన్‌ మన్రో.. బాలుడి వద్దకు వెళ్లి అభినందించాడు. ఇదే మ్యాచ్‌లో అంతకు ముందు ఓ క్యాచ్‌ను పట్టుకోలేకపోయిన ఆ బాలుడు.. రెండో అవకాశాన్ని చక్కగా వినియోగించుకోవడం గమనార్హం. 

Updated : 05 Mar 2024 15:53 IST

Tags :

మరిన్ని