AFG vs AUS: మ్యాక్స్‌వెల్‌ విశ్వరూపానికి.. వాంఖడె చిన్నబోయిందిలా..

ఇంటర్నెట్‌ డెస్క్‌: అఫ్గాన్‌(Afghanistan)కు గుండెకోత మిగులుస్తూ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌(Glenn Maxwell) విరోచిత డబుల్‌ సెంచరీ(201*: 128 బంతుల్లో 10X6, 21X4)చేసి ఆస్ట్రేలియా(Australia)ను గెలిపించాడు. అఫ్గాన్‌ నిర్దేశించిన 292 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్‌ జట్టు 46.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 91 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఓటమి అంచులకు చేరిన ఆసీస్‌కు మ్యాక్స్‌వెల్‌ యోధుడిలా మారి మరుపురాని విజయాన్ని అందించాడు. ఒక ఎండ్‌లో కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ ప్రేక్షకుడిగా మారిన వేళ.. మ్యాక్స్‌వెల్‌ తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. తొడ కండరాలు పట్టేసినా.. కాలు కదపకుండా ఎడాపెడా సిక్స్‌లు, ఫోర్లతో మోతమోగించాడు. ఇంకెందుకు ఆలస్యం మ్యాక్స్‌ ఆటను ఒకసారి మీరూ ఆస్వాదించండి..   

Updated : 08 Nov 2023 01:54 IST

Tags :

మరిన్ని