FlashBack: మూడు సెంచరీలు, 628/8.. టీమిండియా ఇక వెనక్కి చూడలేదు!

1990ల్లో విదేశాల్లో టీమిండియా ఆట తీరు అంత చెప్పుకోదగ్గ విధంగా ఏమీ లేదు. అలాంటి సమయంలో 2002 ఆగస్టులో హెడింగ్లే మైదానం వేదికగా.. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు సిద్ధమైంది భారత్‌. టాస్‌ నెగ్గడంతో దాదా క్షణం కూడా ఆలోచించకుండా.. ధైర్యంగా తొలుత బ్యాటింగ్‌కు సై అన్నాడు. ఇక అంతే టీమిండియా వెనక్కి తిరిగి చూసుకోలేదు! ఓపెనర్లుగా వచ్చిన రాహుల్‌ ద్రవిడ్‌ (148), సంజయ్ బంగర్ (68) విశ్వరూపం ప్రదర్శించారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 177 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ సమయంలో 4 స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సచిన్‌ 193 పరుగులతో ఇరగదీశాడు. ఇక సౌరభ్‌ సైతం 128 పరుగులు చేయడంతో.. తొలి ఇన్నింగ్స్‌ను టీమిండియా 628/8కు డిక్లేర్‌ చేసింది. ఆ తర్వాత ఇంగ్లండ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 273, రెండో ఇన్నింగ్స్‌ (ఫాలో ఆన్‌)లో 309 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా ఇన్నింగ్స్‌ 46 పరుగుల తేడాతో విదేశీ గడ్డపై మన మువ్వన్నెల జెండా రెపరెపలాడింది.

Updated : 09 Jun 2023 17:36 IST

Tags :

మరిన్ని