తెదేపాలో చేరుతా.. టికెట్‌ ఇస్తే పోటీ చేస్తా: మేకపాటి

త్వరలోనే తెలుగుదేశంలో చేరతానని నెల్లూరు జిల్లా ఉదయగిరి వైకాపా ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి (Mekapati Chandrasekhar Reddy) స్పష్టం చేశారు. తనతోపాటు జిల్లాకు చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఆనం రాంనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా తెలుగుదేశంలోకి చేరతారని చెప్పారు. వైఎస్‌ఆర్‌ జిల్లా బద్వేలు నియోజకవర్గం అట్లూరు విడిది కేంద్రంలో లోకేశ్‌ను మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కలిశారు. లోకేశ్ పాదయాత్ర నెల్లూరు జిల్లా ఉదయగిరిలోకి ప్రవేశిస్తుండగా... స్వాగతం పలికి యాత్రను దిగ్విజయం చేస్తానని తెలిపారు.

Updated : 10 Jun 2023 16:42 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు