తాగడానికి వాళ్లూ కారణమే!

తల్లితండ్రులకు ఆల్కహాల్‌ తీసుకునే అలవాటు ఉంటే అది కొంతవరకూ పిల్లలకు జన్యుపరంగా వస్తుందని గతకాలపు పరిశోధనల్లో స్పష్టమైంది.

Published : 04 Dec 2022 00:06 IST

తాగడానికి వాళ్లూ కారణమే!

ల్లితండ్రులకు ఆల్కహాల్‌ తీసుకునే అలవాటు ఉంటే అది కొంతవరకూ పిల్లలకు జన్యుపరంగా వస్తుందని గతకాలపు పరిశోధనల్లో స్పష్టమైంది. ఇప్పుడు, కుటుంబ వాతావరణం- ముఖ్యంగా- తల్లిదండ్రుల మధ్య ఉండే ఘర్షణ వైఖరి లేదా విడాకులు తీసుకోవడం వంటివి కూడా జన్యువుల్ని ప్రభావితం చేస్తాయనీ, అది వాళ్లను ఆల్కహాల్‌కు బానిసల్ని చేసే ప్రమాదం ఉందనీ హెచ్చరిస్తున్నారు రట్జెర్స్‌ యూనివర్సిటీ నిపుణులు. వ్యక్తికి సంబంధించిన శారీరక, మానసికపరమైన అనేక అంశాల్ని వంశపారంపర్యంగా వచ్చే జన్యువులే ప్రభావితం చేస్తాయి. అయితే కుటుంబ పరిస్థితులు సైతం ఆయా జన్యువులమీద ప్రభావం కనబరుస్తున్నట్లు గుర్తించారు. చిన్నవయసులోనే ఆల్కహాల్‌కు బానిసలుగా మారిన కొందరిని గమనించినప్పుడు- వాళ్ల తల్లితండ్రుల్లో చాలామంది విడాకులు తీసుకున్నట్లు తేలిందట. కాబట్టి మద్యానికి అలవాటుపడ్డవాళ్లకి కౌన్సెలింగ్‌ ఇచ్చేటప్పుడు ఈ విషయాన్నీ దృష్టిలో పెట్టుకోవాలి అంటున్నారు పరిశోధకులు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..