చెప్పమ్మా... గూగులమ్మా!

ఎందుకు.. ఏమిటి.. ఎప్పుడు.. ఎలా.. ఎవరు.. ఇలా ఏది తెలుసుకోవాలన్నా గూగుల్‌ చేయడం అందరికీ అలవాటు అయిపోయింది కదా. అలా ఈ సంవత్సరంలో భారతీయులు ఎక్కువగా ఎటువంటి విషయాలకోసం ఆ సెర్చింజన్‌ను ఆశ్రయించారంటే...

Published : 25 Dec 2022 00:25 IST

చెప్పమ్మా... గూగులమ్మా!

ఎందుకు.. ఏమిటి.. ఎప్పుడు.. ఎలా.. ఎవరు.. ఇలా ఏది తెలుసుకోవాలన్నా గూగుల్‌ చేయడం అందరికీ అలవాటు అయిపోయింది కదా. అలా ఈ సంవత్సరంలో భారతీయులు ఎక్కువగా ఎటువంటి విషయాలకోసం ఆ సెర్చింజన్‌ను ఆశ్రయించారంటే...


సినిమాలు

ఏడాదిలో కలెక్షన్ల వర్షం కురిపించిన సినిమాల్లో ‘కాంతార’ ముందుంటుంది. కానీ, గూగుల్‌ సెర్చ్‌ లిస్టులో మాత్రం దానిది అయిదో స్థానం. అయితే టాప్‌ టెన్‌లో ఆరు సినిమాలు దక్షిణాదివే కావడం విశేషం.

1. బ్రహ్మాస్త్ర: పార్ట్‌వన్‌-శివ
2. కేజీఎఫ్‌: ఛాప్టర్‌ 2
3. ది కశ్మీర్‌ ఫైల్స్‌
4. ఆర్‌ఆర్‌ఆర్‌
5. కాంతార
6. పుష్ప: ది రైజ్‌
7. విక్రమ్‌
8. లాల్‌సింగ్‌ చడ్డా
9. దృశ్యం-2
10. థోర్‌: లవ్‌ అండ్‌ థండర్‌


క్రీడలు

ఇండియాలో క్రికెట్‌కి ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. అందుకే ఫిఫా వరల్డ్‌ కప్‌ను మించి ఐపీఎల్‌ కోసం అన్వేషించారు భారతీయులు.

1. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)
2. ఫిఫా వరల్డ్‌ కప్‌
3. ఆసియా కప్‌
4. ఐసీసీ టీ20 వరల్డ్‌ కప్‌
5. కామన్వెల్త్‌ గేమ్స్‌
6. ఇండియన్‌ సూపర్‌ లీగ్‌
7. ప్రో కబడ్డీ లీగ్‌
8. ఐసీసీ ఉమెన్స్‌ వరల్డ్‌ కప్‌
9. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌
10. వింబుల్డన్‌


దగ్గర్లో..?

గూగుల్‌ మ్యాప్స్‌ వచ్చాక కొత్త ప్రాంతానికి వెళ్లడమూ, మన చుట్టుపక్కలున్న హాస్పిటళ్లూ, హోటళ్ల వంటి వాటిని వెతికిపట్టుకోవడమూ తేలికైంది. అందులో భాగంగా ‘నియర్‌ మీ’ విభాగంలో ఎక్కువమంది దేనికోసం వెతికారంటే...

1. దగ్గర్లో కొవిడ్‌ టీకా వేసేదెక్కడ?
2. స్విమ్మింగ్‌ పూల్‌
3. వాటర్‌ పార్క్‌
4. మూవీస్‌  
5. టేకవుట్‌ రెస్టరంట్స్‌
6. మాల్స్‌
7. మెట్రో స్టేషన్‌
8. ఆర్టీపీసీఆర్‌ కేంద్రం
9. పోలియో చుక్కల కేంద్రం
10. అద్దె ఇళ్లు


ఏమిటి..?

సందేహాలను తీర్చడంలో గూగుల్‌ను మించిన గ్రంథాలయం ఏముంది! అందుకే అగ్నిపథ్‌ పథకం దగ్గర నుంచి మయోసైటిస్‌ వ్యాధి దాకా ఎన్నో అంశాల గురించి గూగుల్‌ను అడిగారు ఇండియన్‌ నెట్‌ యూజర్లు.

1. అగ్నిపథ్‌ పథకమేంటి?
2. నాటో వివరాలేంటి?
3. ఎన్‌ఎఫ్‌టీ అంటే..?
4. పీఎఫ్‌ఐ  అంటే...
5. స్క్వేర్‌ రూట్‌ ఆఫ్‌ 4 ఎంత?
6. సరోగసీ అంటే..?
7. సూర్యగ్రహణం అంటే..?
8. ఆర్టికల్‌ 370 అంటే..?
9. మెటావర్స్‌ అంటే..?
10. మయోసైటిస్‌ అంటే..?


వ్యక్తులు

టీనటులు, క్రీడాకారుల గురించే ఎక్కువ మంది గూగుల్‌ చేస్తుంటారని అనుకుంటాం కదా. కానీ, ఈ సంవత్సరం నాయకుల గురించి ఎక్కువ వెతికారు భారతీయులు. వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకి వచ్చిన నూపుర్‌ శర్మ మొదటి స్థానంలో ఉంటే... ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వివరాల కోసం గూగుల్‌ను జల్లెడపట్టారు.

1. నుపుర్‌ శర్మ
2. ద్రౌపది ముర్ము
3. రిషి సునాక్‌
4. లలిత్‌ మోదీ
5. సుస్మితా సేన్‌
6. అంజలి అరోరా
7. అబ్దు రోజిక్‌
8. ఏక్‌నాథ్‌ షిండే
9. ప్రవీణ్‌ తాంబే
10. అంబర్‌ హెర్డ్‌


ఎలా..?

వరి బిజీలో వాళ్లుంటున్న ఈ రోజుల్లో ఏది ఎలా చేయాలో పక్కవారికి చెప్పేదెవరు? అందుకే మనవాళ్లు ప్రతిదానికీ జై గూగుల్‌ అంటున్నారు.

1. వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడం ఎలా?
2. పీటీఆర్సీ చలానాను డౌన్‌లోడ్‌ చేయడమెలా?
3. పి.మార్టినీని (కాక్‌టైల్‌ డ్రింక్‌) తాగడమెలా?
4. ఈ-శ్రమ్‌ కార్డును పొందడమెలా?
5. ప్రెగ్నెన్సీ సమయంలో మోషన్స్‌ను కట్టడి చేయడమెలా?
6. ఆధార్‌తో ఓటర్‌ కార్డును లింక్‌ చేయడమెలా?
7. బనానా బ్రెడ్‌ను తయారు చేయడమెలా?
8. ఆన్‌లైన్‌లో ఐటీఆర్‌ను ఎలా ఫైల్‌ చేయాలి?
9. ఇమేజ్‌ మీద హిందీ టెక్ట్స్‌ను ఎలా రాయాలి?
10. వర్డిల్‌ని ఎలా ఆడాలి?


వార్తలు

వార్తాంశాల్లో ఎక్కువగా చదివింది గానకోకిల లతా మంగేష్కర్‌ మరణం గురించే. ఆ తర్వాత పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య గురించి ఆరా తీశారు.

1. లతా మంగేష్కర్‌ మరణం
2. సిద్ధూ మూసేవాలా హత్య
3. రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం
4. యూపీ ఎన్నికల ఫలితాలు
5. ఇండియాలో కొవిడ్‌ కేసులు
6. షేన్‌ వార్న్‌ మృతి
7. ఎలిజబెత్‌ రాణి-2 అస్తమయం
8. కేకే మరణం
9. హర్‌ఘర్‌ తిరంగా
10. బప్పీలహరి మృతి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..