సిల్లీపాయింట్‌

కారణం ఏమిటో తెలియదుకానీ... దక్షిణభారతదేశంలో ఎక్కువమందికి రక్తం గ్రూపు ఒ-పాజిటివే ఉంటుంది. దాదాపు 39 శాతం ఇక్కడ ఆ బ్లడ్‌ గ్రూపువారే మరి!

Published : 29 May 2022 00:11 IST

సిల్లీపాయింట్‌

కారణం ఏమిటో తెలియదుకానీ... దక్షిణభారతదేశంలో ఎక్కువమందికి రక్తం గ్రూపు ఒ-పాజిటివే ఉంటుంది. దాదాపు 39 శాతం ఇక్కడ ఆ బ్లడ్‌ గ్రూపువారే మరి!

* ప్రపంచంలో హిందువులూ, యూదులూ తప్ప ఇంకెవరూ అమావాస్య రోజున పండుగలు చేసుకోరు. యూదుల సబ్బాత్‌ ఆ చీకటి రోజే ఉంటుంది. హిందువులకైతే దీపావళి, పోలాల అమావాస్య... ఇలా కొన్ని పవిత్రదినాలున్నాయి!  

* ఇంటి భోజనం కన్నా రెస్టరంట్‌ తిండిని ఇష్టపడేవారిలో స్పెయిన్‌ దేశస్థులే టాప్‌. వారంలో ఐదురోజులు వాళ్లు బయటే తింటారట... ఇందుకోసం ఏటా దాదాపు లక్షన్నర దాకా ఖర్చుచేస్తారట!


డాల్ఫిన్‌లు ఒకదానినొకటి పేర్లు పెట్టే పిలుచుకుంటాయి... అఫ్‌కోర్స్‌ వాటి భాషలోనే లెండి!


కోలా వేలి ముద్రలు... మనుషులకి చాలా దగ్గరగా ఉంటాయి. ఎంతగా అంటే నేరాలు జరిగినప్పుడు వీటి వేలిముద్రలతో పోలీసుల్ని తప్పుదారి పట్టించేంతగా!


* ఆల్మండ్‌, బఫెలో, క్యాల్షియం, ట్రయాంగిల్‌, పింక్‌, స్పీడ్‌, వై నాట్‌, ఓకే, లాస్ట్‌ ఛాన్స్‌, క్లైమాక్స్‌... ఇవన్నీ అమెరికాలోని కొన్ని చిన్న నగరాల పేర్లు!
* జెల్లీ ఫిష్‌కి 24 కళ్లుంటాయి!
* తేళ్ళలో 1300 రకాలున్నాయి. వాటిలో 34 రకాల తేళ్ళు... మనిషిని ఇట్టే కుట్టి చంపేయగలవు.
* తాటిచెట్లెక్కి కల్లు తాగే అలవాటు... చింపాంజీలకీ ఉందట!
* దక్షిణ అమెరికాలో కనిపించే స్లాత్‌ అన్న జంతువు ప్రపంచంలోనే మహా బద్ధకిస్టు! తన ఆహారంగా ఒక్క ఆకుని తినాలన్నా సరే... చాలా నెమ్మదిగా నెలరోజుల సమయం తీసుకుంటుందట!
* డెన్మార్క్‌ దేశంలో తల్లిదండ్రులు- పిల్లలకు తమకు నచ్చిన పేర్లు పెట్టడానికి వీల్లేదు. అక్కడి ప్రభుత్వం ప్రచురించిన ఏడువేల పేర్లతో కూడిన జాబితాలో నుంచే... ఒకదాన్ని ఎంపిక చేసుకోవాలి.
* కొంతమంది డాక్టర్ల చేతిరాత గందరగోళంగా ఉంటుంది కదా. అందుకే, డాక్టర్ల ప్రిస్క్రిప్షన్‌ని అర్థవంతమైన అక్షరాలుగా చూపించడానికని ప్రత్యేక మెషీన్‌లున్నాయి అమెరికాలో.


ఇండో నేషియాలో ఆ మధ్య ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓ సంస్థ తిరుగుబాటు చేసింది. ఆ సంస్థ జెండా రంగు పసుపు. అందువల్ల, బట్టలకూ వాహనాలకూ ఇతరత్రా ఏ వస్తువులకైనా పసుపు రంగు వాడకూడదని నిషేధం విధించింది ప్రభుత్వం!


ఇయర్‌ ఫోన్స్‌ అందరి చెవులకీ సరిపోవు. ఇవి కొందరి చెవులకి మరీ బిగుతుగా అనిపిస్తే... కొందరికి చాలా వదులవుతాయి. అలాంటివాటితో పడే బాధలకి తాజాగా ‘ఇయర్‌బడ్‌ కార్టిలెజ్‌ డెఫిషియన్సీ సిండ్రోమ్‌’(ఈసీడీఎస్‌) అని పేరుపెట్టారు అమెరికాలో!


* జపాన్‌ భాషలో ‘ఇకమెషు దాన్షి’ అంటే ‘కళ్లు తుడిచే అబ్బాయి’ అని అర్థం. ఆ దేశంలో ఆ పేరుతో ఓ కంపెనీ ఉంది. మనం ఏదైనా ట్రాజెడీ సినిమా చూడాలనుకుంటే ఆ సంస్థ కొంత డబ్బు తీసుకుని మనతోపాటూ ఒకబ్బాయిని పంపిస్తుంది. అతను... మనం ఆ సినిమాలోని విషాదాన్ని తట్టుకోలేక ఏడుస్తూ ఉంటే కన్నీళ్లు తుడిచి ఓదారుస్తుంటాడు.


జీబ్రాల్ని... వాటికున్న గీతల కారణంగా ఈగలూ, పురుగులేవీ ముట్టవు. ఆ గీతలు కీటకాల్ని గందరగోళ పరుస్తాయట. అందువల్లే, జపాన్‌ రైతులు ఆవులకీ జీబ్రాల్లాగా గీతలు గీస్తున్నారు.


పసిఫిక్‌ మహా సముద్రం లోని నియూ అన్న చిన్నదీవి మిక్కీ మౌస్‌లాంటి డిస్నీ బొమ్మలతో...  కరెన్సీ నాణేలని ముద్రిస్తుంటుంది.  చుట్టుపక్కల దేశాల్లో ఆ నాణేలకి మంచి క్రేజ్‌ ఉంది!


మన ‘ఆదిత్య 369’ వంటి సినిమాలని చైనాలో ప్రదర్శించలేం. ఎందుకూ అంటారేమో... అక్కడ ‘టైమ్‌ ట్రావెల్‌’కి సంబంధించిన సినిమాలేవీ తీయకూడదూ, ప్రదర్శించకూడదూ అన్న చట్టం ఉంది.


ఐదో మహా సముద్రం!

నేషనల్‌ జియోగ్రఫిక్‌ సొసైటీకి చెందిన కార్టోగ్రాఫర్స్‌ ఐదో మహాసముద్రాన్ని గతేడాది అధికారికంగా గుర్తించారు. అంటార్కిటికా ఖండాన్ని చుట్టి ఉన్న ఆ మహాసముద్రానికి ‘సదరన్‌ ఓషన్‌’ అన్న పేరు పెట్టారు. దాంతో 1915 నుంచీ ముద్రితమవుతోన్న అట్లాస్‌లనూ ప్రపంచ పటాలనూ మార్చి మరో కొత్త మ్యాప్‌ను తయారు చేయాల్సి ఉంది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..