దేవుళ్ళకు స్వెటర్‌లు!

చలి చంపేస్తోంది బాబోయ్‌... అనుకోని వారుంటారా ఈ కాలంలో. గజగజ వణికించే చలిపులి నుంచి కాపాడుకోవడానికి స్వెటర్లలో దుప్పట్లలో నిండా మునిగిపోతుంటాం.

Published : 07 Jan 2023 23:35 IST

దేవుళ్ళకు స్వెటర్‌లు!

లి చంపేస్తోంది బాబోయ్‌... అనుకోని వారుంటారా ఈ కాలంలో. గజగజ వణికించే చలిపులి నుంచి కాపాడుకోవడానికి స్వెటర్లలో దుప్పట్లలో నిండా మునిగిపోతుంటాం. మరి మనమంటే అలా వెచ్చగా ఉంటాం కానీ, దేవుళ్ల పరిస్థితి ఏంటి? అయినా భగవంతుడికి చలి బాధేంటి అని అనుకుంటున్నారు కదా... కానీ ఉత్తరప్రదేశ్‌లో ఇప్పుడు ప్రముఖ దేవాలయాల్లో దేవతా విగ్రహాలను స్వెటర్లు, దుప్పట్లు, శాలువాలు, గ్లవుజులతో అలంకరిస్తున్నారు. శీతగాలులతో చల్లబడిన ఆ ప్రాంతంలో ప్రాణప్రతిష్ఠ చేసిన దేవతా విగ్రహాల్లో భగవంతుడు కొలువుదీరి ఉంటాడని అక్కడి వారి నమ్మకం. అందుకే అయోధ్యలోని రామ్‌లల్లా, మథురలోని రాధా వల్లభ్‌ మందిర్‌, వారణాసిలోని దేవతా మూర్తులకు వెచ్చటి ఉన్ని దుస్తులు కప్పుతున్నారు. పైగా ఈ కాలంలో అక్కడ భక్తులే వాటిని కానుకలుగానూ సమర్పించడం ఆనవాయితీ. అలా కానుకలుగా సమర్పించిన స్వెటర్లు, దుప్పట్లు, శాలువాలు, గ్లవుజుల్నే స్వామి వారికి వేస్తుంటారు. ఆ ఆలయాల బయటా ఇవి ప్రత్యేకంగా దొరకడంతోపాటు, ఈ కామర్స్‌ సైట్లలోనూ అందుబాటులో ఉంటున్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..