Published : 29 Jan 2023 01:13 IST

పిల్లల కోసం బైక్‌ బెల్ట్‌!

చాలామంది టూ వీలర్‌పైన పిల్లల్నీ ఎక్కించుకుని తీసుకెళ్తుంటారు. అలాంటి సమయాల్లో కాస్త పెద్దపిల్లలైతే జారి పడిపోకుండా ఎలాగోలా పట్టుకుంటారు కానీ చిన్న పిల్లలతోనే ఇబ్బంది. అటూ ఇటూ కదులుతూ ఉండటమో, నిద్రపోవడమో చేస్తుంటారు. అందుకే ప్రయాణం చేస్తున్నంతసేపూ వాళ్లమీద ఓ కన్నేసే ఉంచాలి. బైక్‌ మీద ఇద్దరు పెద్దవాళ్లు ఉన్నప్పుడు పర్వాలేదు కానీ అమ్మనో, నాన్ననో ఒక్కరే డ్రైవింగ్‌ చేస్తూ పిల్లలతో వెళ్లాలంటే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడూ ఏ ఇబ్బందీ లేకుండా, పిల్లలు పడిపోతారన్న బెంగా లేకుండా ఉండాలా... అయితే ఈ టూ వీలర్‌ బేబీ బెల్ట్‌ను కొనుక్కోవాల్సిందే. బ్యాక్‌ప్యాక్‌లా ఉండే ఈ బెల్ట్‌... అటు చిన్నారుల్నీ ఇటు మనల్నీ కలుపుతుంది. దీనివల్ల బుజ్జాయిలు ఎటూ కదలకుండా ఉంటారు. పిల్లల బొమ్మలతో, రకరకాల పరిమాణాల్లో మార్కెట్లో దొరుకుతున్నాయివి. వాటిల్లో మనకు అవసరమైన దాన్ని ఎంచుకుంటే సరిపోతుంది!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..