ఐసుముక్కతో ఇబ్బంది పడక్కర్లేదు

చర్మసంరక్షణలో భాగంగా అప్పుడప్పుడూ ఐసుముక్కతో ముఖానికి మర్దన చేయడం... ఎండాకాలంలో వేడి ప్రభావాన్ని తగ్గించేందుకు చల్లని ఐసుముక్కను ముఖంపైన రాసుకోవడం చాలామంది చేసేదే.

Updated : 04 Jun 2023 04:10 IST

చర్మసంరక్షణలో భాగంగా అప్పుడప్పుడూ ఐసుముక్కతో ముఖానికి మర్దన చేయడం... ఎండాకాలంలో వేడి ప్రభావాన్ని తగ్గించేందుకు చల్లని ఐసుముక్కను ముఖంపైన రాసుకోవడం చాలామంది చేసేదే. కానీ చల్లని ఐసు ముక్కను ఆ కాసేపూ చేత్తో పట్టుకోవడం అంటే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. ఆ సమస్య లేకుండా చేసేందుకే ఇప్పుడు ప్రత్యేకంగా ‘ఐస్‌రోలర్‌’ను అందుబాటులోకి తెచ్చారు తయారీదారులు.

సిలికాన్‌తో తయారుచేసిన ఈ రోలర్‌ చూడ్డానికి చిన్న ఐస్‌మౌల్డ్‌లా ఉంటుంది. ఇందులో నీళ్లు నింపి ఫ్రిజ్‌లో పెట్టేస్తే చాలు. ఆ తరవాత మౌల్డ్‌ను చేత్తో పట్టుకుని ముఖానికి ఐసుతో మర్దన చేసుకోవచ్చు. పైగా కేవలం నీళ్లే కాకుండా అప్పుడప్పుడూ కీరా గుజ్జూ, గ్రీన్‌టీ, నిమ్మరసం, గులాబీరేకలు వంటివన్నీ కూడా వేసుకుని నచ్చిన ఐస్‌ప్యాక్‌ను కూడా తయారుచేసుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..