మరో పావుగంట పెంచాల్సిందే

రోజులో ఎక్కువ సమయం కూర్చునే పని చేస్తున్నారా? అయితే... మామూలుకన్నా మీరు మరో పావుగంట ఎక్కువసేపు వ్యాయామం చేయాల్సిందేనట.

Updated : 11 Feb 2024 07:59 IST

రోజులో ఎక్కువ సమయం కూర్చునే పని చేస్తున్నారా? అయితే... మామూలుకన్నా మీరు మరో పావుగంట ఎక్కువసేపు వ్యాయామం చేయాల్సిందేనట. ఉదాహరణకి రోజూ 20 నిమిషాలు ఏదైనా వ్యాయామం చేస్తే మంచిదని చెబుతుంటారు. కానీ రోజంతా కూర్చుని ఉండేవారు అందరిలా ఆ 20 నిమిషాలకి పరిమితం కాకుండా మరో 15 నిమిషాలు అదనంగా వ్యాయామం చేయాలంటున్నారు పరిశోధకులు. దీన్ని ఉదయం సాయంత్రం- ఏడు ఎనిమిది నిమిషాలుగా విభజించుకున్నా చాలు. ఆఫీసులో ఎనిమిదిగంటలు కూర్చుంటే గంటకోసారి లేచి ఒకట్రెండు నిమిషాలు నడిచినా కొంతవరకూ ఫలితం ఉంటుందట.

విందు ఖరీదు లక్ష రూపాయలు!

అమెరికన్‌ మెడికల్‌ అసోసియేషన్‌కి చెందిన ‘జామా నెట్‌వర్క్‌’ పత్రిక ఇటీవల ఈ సూచనలు చేసింది. శారీరక శ్రమ ఉన్నవాళ్ళకన్నా ఎప్పుడూ కూర్చునే ఉండే వాళ్ళకి హృద్రోగ సమస్యవల్ల 34 శాతం ఎక్కువగా, ఇతరత్రా వ్యాధుల వల్ల 16 శాతం ఎక్కువగా మరణం సంభవించే ప్రమాదం ఉందని ఈ అధ్యయనం చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు ఎనిమిది లక్షలమందిని  దశాబ్దంపాటు అధ్యయనం చేశాక ఈ హెచ్చరికల్ని జారీ చేసిందీ సంస్థ. శారీరక శ్రమని పెంచుకోవడమే దీనికి పరిష్కారమని సూచిస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..