పేద విద్యార్థుల్ని ఫ్లైట్‌ ఎక్కిస్తున్నాడు!

ఆయనో పంచాయతీ అధ్యక్షుడు. తమ గ్రామంలోని సర్కారుబడిలో విద్యార్థుల శాతాన్ని పెంచాలనుకున్నాడు. అందుకో వినూత్న నజరానా ప్రకటించాడు.

Published : 11 Feb 2024 00:09 IST

యనో పంచాయతీ అధ్యక్షుడు. తమ గ్రామంలోని సర్కారుబడిలో విద్యార్థుల శాతాన్ని పెంచాలనుకున్నాడు. అందుకో వినూత్న నజరానా ప్రకటించాడు. అక్కడ పదోతరగతి చదువుతున్న పిల్లలందరినీ ఫ్లైట్‌ ఎక్కించి మరీ పర్యటనకి తీసుకెళుతున్నాడు. తమిళనాడు కోయంబత్తూరు జిల్లా పరిధిలోని సింగారంపాళయం అన్న గ్రామానికి అధ్యక్షుడాయన. పేరు జ్ఞానశేఖరన్‌. అక్కడున్న ప్రభుత్వ హైస్కూల్లో చేరేవాళ్ళ సంఖ్య తగ్గడం, చేరినా డ్రాప్‌అవుట్స్‌ పెరుగుతుండటంతో ఈ పథకాన్ని అమలుచేస్తున్నాడు. ప్రతి జనవరిలోనూ పదో తరగతి పిల్లలూ వాళ్ళ తల్లిదండ్రుల్ని కోయంబత్తూరు నుంచి చెన్నైకి ఫ్లైట్‌లో తీసుకెళుతున్నాడు. ఆకాశంలో తప్ప విమానాలని నేరుగా చూడనివాళ్ళకి సరికొత్త అనుభవాన్ని పంచుతున్నాడు. అక్కడ వివిధ పర్యటక ప్రాంతాలని చూపించి- రాత్రికి రైలులో థర్డ్‌ ఏసీలో కోయంబత్తూరుకి తీసుకొస్తున్నాడు! ఆయన ఆశించినట్టే- గత రెండేళ్ళలో బడిలో చేరేవాళ్ళ సంఖ్య పెరిగిందట... గత ఏడాది ఉత్తీర్ణతా శాతం కూడా వందకు చేరిందట!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..