ఈ ఉగాది పండుగ... ఇంకాస్త కొత్తగా!
ఎంత బిజీబిజీ జీవితమైనా... పండుగొస్తే సంతోషంగా గడపాలనుకుంటాం. కానీ పనిభారం వల్లనో, సమయం లేకనో నచ్చిన వంటకాలు వండుకోవడానికి కాస్త ఇబ్బంది పడుతుంటాం. అందుకే ఆ ఇబ్బందిని పోగొట్టి పండుగ ఆనందాన్ని తేవడానికి మార్కెట్లో కొన్ని కొత్త ఉత్పత్తులు వచ్చాయి. షడ్రుచుల ఉగాది పచ్చడి రెడీమేడ్ ప్యాకెట్టూ, రెడీమిక్స్ బొబ్బట్ల కిట్టూ, ఇంకా పండుగ శుభాకాంక్షలు చెప్పే మిఠాయిలూ దొరుకుతున్నాయి!
షడ్రుచులూ ఒకేదాంట్లో...
పల్లెటూళ్లో అయితే ఇంటి దగ్గరే వేప పువ్వూ, మామిడికాయా... ఇలా ఉగాది పచ్చడికి కావాల్సిన రుచుల పదార్థాలన్నీ అందుబాటులో ఉంటాయి. కానీ నగరాల్లోనూ, విదేశాల్లోనూ స్థిరపడిన మన తెలుగువాళ్లు ఉండే ప్రాంతాల్లోనూ అలా పక్కనే దొరకవు కదా. ముఖ్యంగా వేపపూత కోసం కాస్త వెతకాల్సి వస్తుంది. కానీ తెలుగు సంవత్సరాది ప్రారంభమయ్యే ఈ పండుగ రోజు... ఉగాది పచ్చడి లేకుండా ఎలా... ఎన్ని రకాల వంటకాలు చేసినా లోటుగానే ఉంటుంది కదా. అందుకే మరి... దాన్ని భర్తీ చేయడానికి ఉగాది పచ్చడి రెడీమేడ్ ప్యాకెట్ వచ్చింది. చేదూ, పులుపూ, తీపీ, కారమూ, వగరూ, ఉప్పూ... ఇలా ఆరు రుచుల పదార్థాలు ఉంటాయి ఇందులో. ఈ హడావుడి జీవితాల్లో ఏ ఇబ్బందీ లేకుండా పండుగను ఆస్వాదించాలనుకునేవారికి ఇది చక్కగా సరిపోతుంది. హాయిగా ఒక ప్యాకెట్ కొన్నామంటే క్షణాల్లో ఉగాది పచ్చడి సిద్ధం చేసేసుకోవచ్చు. తెలుగు సంవత్సరాన్ని షడ్రుచులతో మొదలుపెట్టొచ్చు!
బొబ్బట్లు... ఎవరైనా చేసేలా!
బొబ్బట్లూ, పోలీలూ, భక్ష్యాలూ... ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలిచే ఈ తీపి అప్పాలు చేయడం అంత సులువేం కాదు. పప్పు ముందుగా ఉడికించుకునీ బెల్లంతో కలిపి రుబ్బుకునీ అదంతా చేయడం పెద్ద పనే. దానికి కాస్త సమయమూ ఓపికా కావాల్సిందే. కానీ ఉగాది అనగానే గుర్తొచ్చే ఈ బొబ్బట్లను సులువుగా చేసుకునేలా ఇప్పుడు రెడీమిక్స్‌లు దొరుకుతున్నాయి. వీటిల్లో కొన్ని నేరుగా మైదా లేదా గోధుమ పిండితో చేసిన పిండి ముద్దలో స్టఫ్‌గా పెట్టుకుని చేసుకునేలా ఉంటే... ఇంకొన్ని పొడిలానూ వచ్చాయి. కొన్ని నీళ్లు కలిపి నేరుగా వాడుకోవచ్చు. ఈ రెడీమిక్స్‌లతో గంటల్లో జరిగే పనిని నిమిషాల్లో చేసుకోవచ్చు. ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినా అప్పటికప్పుడు ఏ ఇబ్బందీ లేకుండా బొబ్బట్లను వండేయొచ్చు.
శుభాకాంక్షలతో... ఓ చాక్లెట్!
ఆంగ్ల కొత్త సంవత్సరాన్నే కాదు, మన తెలుగు ఏడాది మొదలయ్యే రోజునూ ఎంతో కోలాహలంగా చేసుకుంటారు కొంతమంది. బంధువులకూ, సన్నిహితులకూ నోరు తీపి చేస్తూ పండుగ శుభాకాంక్షలు చెబుతుంటారు. మీరు కూడా అదే కోవలోకి వస్తారా... అయితే ఈసారి మరింత ప్రత్యేకంగా చేసుకోండి. మామూలుగా ఏదో ఒక చాక్లెటో, మిఠాయిల డబ్బానో తెచ్చి ఇవ్వడమో, పంపడమో చేయకుండా... వాటిల్లోనూ ఉగాదిని చూపించేయండి. ఇందుకోసం మార్కెట్లో రకరకాల వెబ్‌సైట్లు అందుబాటులో ఉన్నాయి. మనకు నచ్చిన భాషలో, మెచ్చిన ఫొటోలతో ఉగాది శుభాకాంక్షలు చెబుతూనే చాక్లెట్లనీ, స్వీట్లనీ తయారు చేయించుకోవచ్చు. వాటితోపాటూ ఉగాది గ్రీటింగ్ కార్డునూ జత చేసి ఇవ్వొచ్చు. ఇవేకాదు, ప్రత్యేకంగా బహుమతి బాక్సుల్ని కూడా పండుగ అక్షరాలతో మనకు నచ్చినట్టుగా మార్చుకోవచ్చు. మరెందుకాలస్యం!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
ఇంకా..


తాజా వార్తలు (Latest News)
-
World News
చైనా చొరబాటుపై అమెరికా ముందే చెప్పిందా..? శ్వేతసౌధం స్పందన ఇదే..!
-
Sports News
Virat Kohli: విరాట్ కోహ్లీ.. టీ20లు ఆడటం ఆపేయ్: షోయబ్ అక్తర్
-
India News
Death Penalty: ‘ఉరి’ విధానం క్రూరమైందా..? సుప్రీంకోర్టు ఏమంటోంది..!
-
Politics News
Rahul Gandhi: స్పీకర్‌జీ..వివరణ ఇచ్చేందుకు అనుమతివ్వండి: రాహుల్
-
Movies News
Suriya42: ‘బాహుబలి’, ‘కేజీయఫ్’ రేంజ్లో సూర్య మూవీ ఉంటుందట!
-
India News
Nitish Kumar: ‘హిందీని చంపేస్తారా’.. మండలి ఛైర్మన్‌పై నీతీశ్ ఆగ్రహం!