Weekly Horoscope: రాశిఫలం

ముఖ్యకార్యాలపై పట్టు సాధిస్తారు. అపరిచితులను ఆశ్రయించవద్దు. ఉద్యోగంలో మంచిపేరు తెచ్చుకుంటారు. చంచలత్వం లేకుండా నిర్ణయం తీసుకోండి. గందరగోళ పరిస్థితులున్నాయి. కుటుంబసభ్యుల సూచనలు పనిచేస్తాయి. ఆర్థికస్థితి బాగుంటుంది. అదృష్టయోగం ఉంది. నూతన కార్యాలను ప్రారంభించండి. సూర్యస్తుతి శ్రేయోదాయకం.

Updated : 04 Aug 2022 17:14 IST

Weekly Horoscope: రాశిఫలం

ముఖ్యకార్యాలపై పట్టు సాధిస్తారు. అపరిచితులను ఆశ్రయించవద్దు. ఉద్యోగంలో మంచిపేరు తెచ్చుకుంటారు. చంచలత్వం లేకుండా నిర్ణయం తీసుకోండి. గందరగోళ పరిస్థితులున్నాయి. కుటుంబసభ్యుల సూచనలు పనిచేస్తాయి. ఆర్థికస్థితి బాగుంటుంది. అదృష్టయోగం ఉంది. నూతన కార్యాలను ప్రారంభించండి. సూర్యస్తుతి శ్రేయోదాయకం.


మనోబలం అవసరం. పరిస్థితులు మిశ్రమంగా ఉంటాయి. లోతుగా ఆలోచించవద్దు. మొహమాటం పనికిరాదు. ఆపదలు పొంచి ఉన్నాయి. సమష్టిగా కష్టాలను ఎదుర్కోవాలి. ఉద్యోగంలో ఓర్పు రక్షిస్తుంది. వ్యాపారం అనుకూలంగా లేదు. నూతన ప్రయత్నాలు కొంతకాలం వాయిదా వేయండి. ఇష్టదేవతను స్మరిస్తే మంచిది.


ఉత్తమ కార్యాచరణకు అనుకూలమైన కాలం. విశేషకార్యసిద్ధి ఉంది. ఉద్యోగంలో విజయం లభిస్తుంది. అధికారుల ప్రశంసలు ఉంటాయి. నూతన ప్రణాళికలు సిద్ధం చేయండి. వ్యాపారబలం పెరుగుతుంది. బంధుమిత్రులతో కలిసి ఆనందిస్తారు. మీవల్ల కొందరికి మేలు జరుగుతుంది. ఆదర్శవంతమైన జీవితాన్ని గడుపుతారు. శుభవార్త వింటారు. రవిధ్యానం శుభప్రదం.


ఉద్యోగంలో పదవీలాభం సూచితం. వ్యాపారబలం మిశ్రమం. పట్టుదలతో లక్ష్యాన్ని చేరతారు. దీర్ఘకాలిక ప్రయోజనాలు సిద్ధిస్తాయి. భవిష్యత్తు శుభప్రదం. ముఖ్యకార్యాల్లో శాంతంగా వ్యవహరించాలి. కొన్ని పనులు మధ్యలోనే ఆగే ప్రమాదముంది. రుణసమస్య ఎదురవుతుంది. కలహాలకు అవకాశమివ్వవద్దు. శివస్మరణ చేయండి, శుభం జరుగుతుంది.


ఉద్యోగంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. కాలం సహకరిస్తోంది. బంగారు భవిష్యత్తుకు బాటవేసే సమయమిది. అదృష్టం కలిసివస్తుంది. వ్యాపారబలం బ్రహ్మాండంగా ఉంది. స్థిరచిత్తంతో సమస్యలను పరిష్కరించండి. మిత్రబలం పెరుగుతుంది. ఒక పనిలో పురోగతి ఉంది. సూర్యస్తుతి విజయాన్ని ఇస్తుంది.


ధర్మమార్గంలో విజయం లభిస్తుంది. కర్తవ్యాన్ని సమర్థంగా నిర్వహించండి. ఉద్యోగవ్యాపారాల్లో మేలు జరుగుతుంది. ఆర్థికంగా బాగుంటుంది. భూ-గృహ యోగాలున్నాయి. తగిన నిర్ణయాలు తీసుకుని అమలు చేయండి. గతంలో ఆగిన పనులు పూర్తి అవుతాయి. ప్రయాణాలు కలిసివస్తాయి. ఆంజనేయస్వామి దర్శనం మేలుచేస్తుంది.


కాలం సహకరిస్తోంది. స్వల్ప ప్రయత్నంతోనే అద్భుతమైన విజయం లభిస్తుంది. ఇంటాబయటా అనేక శుభాలున్నాయి. అభివృద్ధిని సాధిస్తారు. ధర్మమార్గంలో న్యాయం జరుగుతుంది. కీర్తిప్రతిష్ఠలున్నాయి. ఉద్యోగం శుభప్రదం. వ్యాపారంలో సంతృప్తినిచ్చే ఫలితముంటుంది. దైవబలం రక్షిస్తోంది. శుభవార్త వింటారు. దేనికీ వెనుకాడవద్దు. లక్ష్మీధ్యానం ఉత్తమం.


ఆర్థికంగా కలిసివస్తుంది. ముఖ్యకార్యాల్లో శీఘ్ర విజయముంటుంది. ఉద్యోగంలో అభివృద్ధి సూచితం, తగిన మానవ ప్రయత్నం చేయండి. మిత్రుల సహాయం అందుతుంది. మీవల్ల కొందరికి ఉపకారం జరుగుతుంది. మొహమాటంతో కొత్త సమస్యలు వస్తాయి. వివాదాలకు తావివ్వవద్దు. ఈర్ష్య పడేవారున్నారు. ఇష్టదేవతా స్మరణ శుభప్రదం.


ఆర్థికస్థితి శుభప్రదం. వ్యాపారం బాగుంటుంది. సకాలంలో పనులను పూర్తిచేస్తే అనేక లాభాలుంటాయి. ఉద్యోగపరంగా అనుకూల కాలం. పెద్దల సలహాలతో శక్తి లభిస్తుంది. ప్రణాళికాబద్ధంగా పని ప్రారంభించండి. తిరుగులేని విజయముంది. ఉత్సాహం తగ్గవద్దు. మంచి భవిష్యత్తు ఉంటుంది. లక్ష్మీస్తోత్రం శక్తినిస్తుంది.


మనోబలంతో లక్ష్యం నెరవేరుతుంది. ఉత్సాహంతో ముందుకెళితే అద్భుతమైన కార్యసిద్ధి ఉంటుంది. సున్నితమైన అంశాల్లో లోతుగా ఆలోచించండి. అదృష్టప్రాప్తి ఉంది. మంచి మనసుతో చేసే పనులు విజయాన్నిస్తాయి. ఉద్యోగంలో గుర్తింపుతోపాటు సంతృప్తీ లభిస్తుంది. శివారాధన కార్యసిద్ధిని ప్రసాదిస్తుంది.


కాలం సహకరిస్తోంది. ఉద్యోగంలో బాగుంటుంది. స్వయంకృషితో పైకి వస్తారు. పలు మార్గాల్లో లాభాలున్నాయి. మనోబలం శక్తినిస్తుంది. విఘ్నాలున్నా అంతిమంగా విజయం చేకూరుతుంది. బాధ్యతలను సమర్థంగా పూర్తి చేస్తారు. వ్యాపారంలో జాగ్రత్త అవసరం. గృహ వాహనాది యోగాలు ఫలిస్తాయి. కుటుంబపరంగా సంతృప్తి లభిస్తుంది. శివారాధన శుభప్రదం.


శుభయోగముంది. లక్ష్యాన్ని సాధిస్తారు. చిన్న ప్రయత్నంతోనే గొప్ప విజయం లభిస్తుంది. ఆటంకాలను అధిగమిస్తారు. ఉద్యోగంలో కోరుకున్న ఫలితాలు వస్తాయి. కొత్త ఆలోచనలతో ఒక మెట్టు ఎదుగుతారు. ఆత్మీయుల సూచనలు ఫలిస్తాయి. వ్యాపారం అద్భుతంగా ఉంటుంది. మేలు చేసేవారున్నారు. శ్రమ ఫలిస్తుంది. ధర్మం రక్షిస్తుంది. విష్ణుదర్శనం మంచిది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..