నీలోనే ఉన్న నువ్వు!
ప్రతి మనిషీ ‘నేనెవరు’ అని ప్రశ్నించుకోవాలి. తనలోకి తాను చూడగలగాలి. అంతర్మథనం సాగాలి. అదే నిజమైన సత్యాన్వేషణ, ఆధ్యాత్మిక ప్రయాణం, వేదాంతజ్ఞానం.
ప్రతి మనిషీ ‘నేనెవరు’ అని ప్రశ్నించుకోవాలి. తనలోకి తాను చూడగలగాలి. అంతర్మథనం సాగాలి. అదే నిజమైన సత్యాన్వేషణ, ఆధ్యాత్మిక ప్రయాణం, వేదాంతజ్ఞానం. ఈ మాటలు ఎందరో మహర్షులు, సద్గురువులు చెప్పారు. గ్రంథాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు పేర్కొన్నాయి. కనిపించేది అంతా కనుమరుగు అవుతుంది. శాశ్వతమైన సత్యమార్గాన్ని తెలుసుకో... అదే భగవంతుడి తత్వం. శరీరం తాత్కాలికం, కనిపించని ఆత్మ శాశ్వతం. కనిపించని పరమాత్మ దానికి ఆధారం. క్లిష్టమైన సంస్కృత శ్లోకాలతో వేద ప్రామాణికాలతో సాగే ప్రబోధాలవల్ల సామాన్య మానవుడు ‘నేనెవరు’ అనేది గుర్తించడంలేదు. తనను తాను విచక్షణతో తెలుసుకోలేక సందేహంలో ఊగిసలాడుతున్నాడు. ఆధ్యాత్మిక జ్ఞానం వైపు దృష్టి సారించడంలేదు. అది తనకు అర్థం కాని భాష, మతిని చాంచల్యంగావించే విద్యగా భావిస్తున్నాడు. సులభంగా, సరళమైన పదాలతో, ఉదాహరణలతో సాగే కథలు, పురాణాలు, ఇతిహాసాలు ఆకర్షించినట్లుగా వేదాలు, ఉపనిషత్తులు, తత్వశాస్త్రాలు సామాన్యుల్లో ప్రాచుర్యం పొంద డంలేదు. ‘దేవుణ్ని మీరు చూశారా’ అని వివేకానందుడు శ్రీరామకృష్ణుణ్ని ప్రశ్నించినప్పుడు ‘అవును, చూశాను, నీవు నన్ను ఎలా చూశావో అలాగే నేను దేవుణ్ని చూశాను’ అని సమాధానం ఇచ్చారు. దేవుడి గురించి, వారి తత్వం గురించి, వేదప్రమాణాలను వల్లె వేయలేదు. నిర్వచనం చెప్పలేదు. ప్రవచనం సాగలేదు. సూటిగా తాను దేవుణ్ని దర్శించానని చెప్పారు. ఆ సందేశమే అన్ని ఉపనిషత్తుల సారం. ‘ఈశ్వర సర్వ భూతానాం’ కనిపిం చేదంతా దైవస్వరూపమే. కానిది సృష్టిలో మరొకటి లేదు. సరళమైన, సులభమైన గురుబోధ నరేంద్రుణ్ని వివేకానందుడిగా తీర్చిదిద్దింది.
నేనెవరు అని ప్రశ్నించుకుని, నీలోకి నువ్వు చూడు అనే సందేశంలో దాగి ఉన్న అంతరార్థం మానవత్వ మార్గం. గ్రహాలపైకి ప్రయాణించే మనిషి, అగాధమైన సముద్రం లోతుకు వెళ్ళే మనిషి, కొన్ని అంగుళాల లోపల ఉన్న అంతరంగంలోకి వెళ్ళలేకపోతున్నాడు.
తాను, తన సంపద, అధికారం, పరివారం శాశ్వతమని మనిషి భావిస్తాడు. అవే అకృత్యాలకు, స్వార్థానికి, సంకుచిత మనస్తత్వానికి కారణాలు. స్వార్థం తగ్గిస్తే శ్రేయస్సు. కోరికను అదుపుచేస్తే శాంతి. మోహక్షయం మోక్షం. నేనెవరు అని ప్రశ్నించుకొనే కనీస జ్ఞానం ఇవ్వగలిగితే చాలు- మనిషి తనలోనే మనసు అనే క్షీరసాగరాన్ని మధించి అమృతాన్ని పొందుతాడు. అంతర్యామి బాహ్యంలో లేడు, పది అంగుళాల పరిమాణంలో నీలోని నువ్వుగా ఉన్నాడని నారాయణసూక్తం చెబుతోంది. ప్రతి ప్రాణీ నారాయణ స్వరూపమే. ఎవరికి సేవ చేసినా నారాయణుడికే చెందినట్లు. ఎవరిని బాధించినా నారాయణుణ్నే బాధించినట్లు. ఇదే బ్రహ్మోపదేశం.
పట్టాభిషేకమైనా, వనవాసమైనా స్థిరచిత్తంతో సాగిన శ్రీరాముడు దేవుడిగా మారాడు. శోకం వదిలి, ఫలితాన్ని ఆశించకుండా నీ కర్తవ్యాన్ని నిష్కామంగా నిర్వర్తించు అని బోధించిన కృష్ణుడు దేవుడిగా పూజలందుకొన్నాడు. అహింస పరమధర్మం. శాంతి, సౌఖ్యాలు సమాజ సేవలోనే దొరుకుతాయి. హృదయాన్ని వీణగా భావించి కరుణ, విషాదం, ఆనందం, దుఃఖం, అవమానం, సత్కారం తీగలుగా రాగాలు పలికిస్తే- అదే ఆనందమయ జీవితానికి ఆధ్యాత్మిక ప్రయాణం.
రావులపాటి వెంకటరామారావు
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
JDU - RJD: జేడీయూ - ఆర్జేడీ మతలబేంటో తెలియాల్సిందే!
-
Sports News
IND vs NZ: తొలి టీ20.. సుందర్, సూర్య పోరాడినా.. టీమ్ఇండియాకు తప్పని ఓటమి
-
Technology News
WhatsApp: మూడు ఆప్షన్లతో వాట్సాప్ టెక్స్ట్ ఎడిటర్ ఫీచర్!
-
Politics News
Jairam Ramesh: భారత్లో అప్రకటిత ఎమర్జెన్సీ: కాంగ్రెస్
-
General News
APPSC: ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షా ఫలితాలు విడుదల
-
India News
Pakistan: పాకిస్థాన్లో అంతుచిక్కని వ్యాధితో 18 మంది మృతి