బిల్లుల చెల్లింపులో జాప్యంపై ఆగ్రహం

బిల్లుల చెల్లింపులో ఆర్థికశాఖ తీవ్ర జాప్యం చేస్తోందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చేసిన పనులకు బిల్లులు చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టులో తరచూ పలు వ్యాజ్యాలు దాఖలు అవుతున్నాయని గుర్తు చేసింది. ...

Published : 08 Dec 2021 05:54 IST

వివరణ ఇవ్వాలని హైకోర్టు స్పష్టీకరణ

ఈనాడు, అమరావతి: బిల్లుల చెల్లింపులో ఆర్థికశాఖ తీవ్ర జాప్యం చేస్తోందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చేసిన పనులకు బిల్లులు చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టులో తరచూ పలు వ్యాజ్యాలు దాఖలు అవుతున్నాయని గుర్తు చేసింది. ట్రెజరీతోపాటు వివిధ శాఖలు బిల్లుల సొమ్మును సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థకు (సీఎఫ్‌ఎంఎస్‌) పంపుతున్నా.. ఏళ్ల తరబడి ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించింది. విశాఖ జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయాలకు స్టేషనరీ సరఫరా చేసినందుకు 2019లో సమర్పించిన బిల్లుల సొమ్ము చెల్లించకపోవడం ఏమిటని ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌.ఎస్‌.రావత్‌ను ఆదేశించింది. విచారణను ఈనెల 13కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ మంగళవారం ఈ మేరకు ఆదేశాలిచ్చారు. విశాఖ జిల్లాలో సచివాలయాలకు స్టేషనరీ సరఫరా చేసిన బిల్లులకు సొమ్ము చెల్లించకపోవడాన్ని సవాలు చేస్తూ నేషనల్‌ కోపరేటివ్‌ కన్‌జ్యూమర్‌ ఫెడరేషన్‌ ఇండియా లిమిటెడ్‌ సంస్థ బ్రాంచి మేనేజరు శ్రీహర్ష హైకోర్టును ఆశ్రయించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని