బాలాజీ జిల్లాలో అధికంగా 746 బస్సులు

కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ఆర్టీసీలో బస్సు సర్వీసులు, డిపోలు, జిల్లా కార్యాలయాల్లోకి సిబ్బంది సర్దుబాటు కొలిక్కి వచ్చింది. వీటితోపాటు ప్రస్తుతం ఉన్న రీజినల్‌ మేనేజర్‌కు

Published : 14 Mar 2022 03:58 IST

ఎన్టీఆర్‌ జిల్లాలో ఎక్కువగా 8 డిపోలు

అల్లూరి జిల్లాలో ఒక్క డిపో, 35 బస్సులే

ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన ఆర్టీసీ

ఈనాడు, అమరావతి: కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ఆర్టీసీలో బస్సు సర్వీసులు, డిపోలు, జిల్లా కార్యాలయాల్లోకి సిబ్బంది సర్దుబాటు కొలిక్కి వచ్చింది. వీటితోపాటు ప్రస్తుతం ఉన్న రీజినల్‌ మేనేజర్‌కు బదులు జిల్లాకు ఓ మేనేజర్‌ పోస్టు, జోనల్‌ పరిధిలో మార్పులు చేస్తూ ఆర్టీసీ యాజమాన్యం ప్రతిపాదనలు సిద్ధం చేసి, ప్రభుత్వానికి పంపింది.

* 26 జిల్లాలకు.. తిరుపతి కేంద్రంగా ఏర్పడే శ్రీబాలాజీ జిల్లాలో అత్యధికంగా 746 బస్సులు ఉండనున్నాయి. విశాఖపట్నంలో 696, ఎన్టీఆర్‌ జిల్లాలో 643 బస్సులు ఉంటాయి.

* అతి తక్కువగా పాడేరు కేంద్రంగా ఏర్పడే అల్లూరి సీతారామరాజు జిల్లాలో 35 బస్సులు, విజయనగరం జిల్లాలో 156, అనకాపల్లి జిల్లాలో 192 సర్వీసులు ఉంటాయి.

* ఎన్టీఆర్‌ జిల్లాలో అత్యధికంగా 8 డిపోలు, విశాఖపట్నం, అనంతపురం, నంద్యాల జిల్లాల్లో ఏడేసి డిపోలు ఉండనున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాడేరు డిపో ఒక్కటే ఉంటుంది.

జోన్లలో మార్పులు

ఆర్టీసీ జోనల్‌ విధానంలో, వాటి పరిధిలో మార్పులకు ప్రతిపాదించారు. ఇప్పటివరకు విజయనగరం, విజయవాడ, నెల్లూరు, కడప జోన్లు ఉండగా.. వాటి స్థానంలో జోన్‌-1, 2, 3, 4 తీసుకొస్తున్నారు. జోన్‌-1 శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాలు, జోన్‌-2లో తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాలు, జోన్‌-3లో గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు, జోన్‌-4లో చిత్తూరు, బాలాజీ, కడప, అన్నమయ్య, అనంతపురం, సత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాలు ఉండనున్నాయి.

* ప్రస్తుతం 12 ఆర్‌ఎం కార్యాలయాల పరిధిలో ఆపరేషన్‌, నిర్వహణ (ఇంజినీరింగ్‌), పర్సనల్‌, ఫైనాన్స్‌, స్టాటిస్టిక్స్‌ విభాగాల్లో పనిచేస్తున్నవారిని, 26 జిల్లా మేనేజర్ల కార్యాలయాలకు సర్దుబాటు చేస్తూ ప్రతిపాదించారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని