Chandra babu:మరో శ్రీలంకగా రాష్ట్రం

వైకాపా ప్రభుత్వ అస్తవ్యస్థ ఆర్థిక విధానాలతో... ఆంధ్రప్రదేశ్‌ తీవ్ర సంక్షోభంలో చిక్కుకుని, మరో శ్రీలంకగా మారబోతోందని తెదేపా అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ ముఖ్యనేతలతో సోమవారం ఆన్‌లైన్‌లో వ్యూహ కమిటీ సమావేశం జరిగింది.

Updated : 05 Apr 2022 06:25 IST

జగన్‌ ప్రభుత్వ నిర్వాకంతో తీవ్ర ఆర్థిక సంక్షోభం దిశగా రాష్ట్రం

ప్రధానికి ఇదే విషయాన్ని అధికారులు చెప్పినట్లున్నారు

అశాస్త్రీయంగా, రాజకీయకోణంలో కొత్త జిల్లాల ఏర్పాటు

తెదేపా అధికారంలోకి వచ్చాక తప్పులు సరిదిద్దుతాం

పార్టీ వ్యూహ కమిటీ సమావేశంలో చంద్రబాబు వ్యాఖ్యలు

ఈనాడు, అమరావతి: వైకాపా ప్రభుత్వ అస్తవ్యస్థ ఆర్థిక విధానాలతో... ఆంధ్రప్రదేశ్‌ తీవ్ర సంక్షోభంలో చిక్కుకుని, మరో శ్రీలంకగా మారబోతోందని తెదేపా అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ ముఖ్యనేతలతో సోమవారం ఆన్‌లైన్‌లో వ్యూహ కమిటీ సమావేశం జరిగింది. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల సమావేశంలోను అదే అభిప్రాయం వ్యక్తమైన విషయాన్ని ఈ సమావేశంలో చంద్రబాబు ప్రస్తావించారు. ఏపీ తీవ్ర సంక్షోభం దిశగా ప్రయాణిస్తోందని ప్రధానితో వివిధ శాఖల అధికారులు చెప్పిన విషయాన్ని చాలా తీవ్రమైనదిగా పరిగణించాల్సి ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. ‘‘జగన్‌ వ్యక్తిగత ఆదాయం కోసమే ప్రజలపై భారం మోపుతున్నారు. ఇసుక, మద్యంలో దోపిడీ జరుగుతోంది. ప్రజలపై విపరీతంగా పెరిగిన నిత్యావసరాల భారం వెనుకా జగన్‌ దోపిడీ ఉంది.  

ఈ వాస్తవాన్ని ప్రజలు గ్రహించాలి. ఒకప్పుడు విద్యుత్‌ మిగులు రాష్ట్రంగా ఉన్న ఏపీలో ఇప్పుడు కోతలు విధించాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? పెరిగిన బిల్లులకు, కోతలకు ప్రజలకు జగన్‌ సమాధానం చెప్పాలి...’’ అని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. కొత్త జిల్లాల ప్రక్రియ అశాస్త్రీయంగా, రాజకీయకోణంలో జరిగిందని ధ్వజమెత్తారు. తెదేపా అధికారంలోకి వచ్చాక తప్పులను సరిదిద్దుతుందని వెల్లడించారు. పన్నులు, ధరల భారంపై బాదుడే బాదుడు పేరుతో ఇంటింటికీ తెదేపా కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. విశాఖ మధురవాడలోని ఐటీ హిల్స్‌లో రూ.1,550కోట్ల విలువ చేసే భూ దందాకు విజయసాయిరెడ్డి పాల్పడ్డారు. దానిపై విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు