MLC Ananthababu: డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం భార్యకు ప్రభుత్వ ఉద్యోగం

హత్యకు గురైన ఎమ్మెల్సీ అనంతబాబు పూర్వ కారు డ్రైవరు సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ ఎం.విక్టర్‌

Updated : 29 May 2022 06:47 IST

పెదపూడి (జి.మామిడాడ), న్యూస్‌టుడే: హత్యకు గురైన ఎమ్మెల్సీ అనంతబాబు పూర్వ కారు డ్రైవరు సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ ఎం.విక్టర్‌ ప్రసాద్‌ చెప్పారు. సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులను శనివారం ఆయన కాకినాడ జిల్లా జి.మామిడాడలో పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... సుబ్రహ్మణ్యం భార్య అపర్ణకు ఆరోగ్యశాఖలో ప్రభుత్వ ఉద్యోగం, సుబ్రహ్మణ్యం తమ్ముడు నవీన్‌కు ఒప్పంద ఉద్యోగం ఇస్తామని తెలిపారు. అపర్ణకు ఉద్యోగ మంజూరు పత్రాన్ని అందించారు. మామిడాడ జగనన్న కాలనీలో సుబ్రహ్మణ్యం భార్య, తల్లికి చెరో సెంటున్నర ఇంటి స్థల పట్టాలను పంపిణీ చేశారు. వాటిలో ప్రభుత్వమే ఇళ్లు కట్టిస్తుందని వివరించారు. ఇప్పటికే ప్రభుత్వం తరఫున రూ.8.25 లక్షలు సుబ్రహ్మణ్యం కుటుంబానికి మంజూరయ్యాయని, హత్య చేసిన వారికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ సభ్యులు కె.బసవరావు, కె.పుట్టారావు, కాకినాడ ఆర్డీవో బి.వి.రమణ, కాకినాడ రూరల్‌ సీఐ శ్రీనివాసరావు తదితరులు ఛైర్మన్‌ వెంట ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని