రాష్ట్రంలోనూ కేంద్ర పంటల బీమా పథకం

రైతులకు గరిష్ఠ ప్రయోజనాలు అందించే విధానాలను రూపొందిస్తే.. కేంద్ర పంటల బీమా పథకం (ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన-పీఎంఎఫ్‌బీవై)లో మళ్లీ భాగస్వాములం అవుతామని

Published : 07 Jul 2022 04:41 IST

రైతులకు గరిష్ఠ ప్రయోజనాలు అందేలా రూపొందించాలి

కేంద్ర వ్యవసాయాధికారులతో సీఎం

ఈనాడు, అమరావతి: రైతులకు గరిష్ఠ ప్రయోజనాలు అందించే విధానాలను రూపొందిస్తే.. కేంద్ర పంటల బీమా పథకం (ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన-పీఎంఎఫ్‌బీవై)లో మళ్లీ భాగస్వాములం అవుతామని ముఖ్యమంత్రి జగన్‌ పేర్కొన్నారు. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ కార్యదర్శి మనోజ్‌ అహూజా ఆధ్వర్యంలోని అధికారుల బృందం బుధవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకాన్ని సీఎం వారికి వివరించారు. రైతు భరోసా, ధరల స్థిరీకరణ నిధి తదితర పథకాలను వారి దృష్టికి తీసుకెళ్లారు. ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు అవసరమైన విధానాలను పీఎంఎఫ్‌బీవైలో రూపొందిస్తే.. రాష్ట్రంలోనూ అమలు చేసేందుకు కేంద్రంతో కలిసి భాగస్వామ్యమవుతామని ముఖ్యమంత్రి తెలిపారని సీఎం కార్యాలయం వెల్లడించింది.

* గన్నవరంలోని సమగ్ర సేవా కేంద్రం, వణుకూరులోని రైతు భరోసా కేంద్రం, కంకిపాడులోని వ్యవసాయ ల్యాబ్‌ను కేంద్ర అధికారుల బృందం సందర్శించింది. ‘ఈ-క్రాపింగ్‌ ద్వారా పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నారు.  రైతుల పొలం నుంచే పంట కొనుగోలు, ఆర్‌బీకేల్లో బ్యాంకింగ్‌ కరస్పాండెంట్లు తదితర అంశాలను అహూజా ప్రశంసించారు’ అని సీఎం కార్యాలయం పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని