డిగ్రీ కోర్సుల స్లైడింగ్‌కు అవకాశం

డిగ్రీ కోర్సుల స్లైడింగ్‌కు డిసెంబరు 1,2 తేదీల్లో అవకాశం కల్పించినట్లు ఉన్నత విద్యామండలి వెల్లడించింది.

Published : 30 Nov 2022 05:38 IST

డిగ్రీ కోర్సుల స్లైడింగ్‌కు డిసెంబరు 1,2 తేదీల్లో అవకాశం కల్పించినట్లు ఉన్నత విద్యామండలి వెల్లడించింది. ఇప్పటికే ప్రవేశాలు పొందిన విద్యార్థులు అదే కళాశాలలో కోర్సులను మార్పు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు పేర్కొంది. మిగిలిన సీట్లను స్పాట్‌ కింద భర్తీ చేసుకోవచ్చు.

పురపాలక పాఠశాలల్లో 1,821 ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు

పురపాలక పాఠశాలల్లో 1,821 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పురపాలక శాఖ ప్రకటించింది. పురపాలక పాఠశాలల పర్యవేక్షణ బాధ్యతలను పాఠశాల విద్యకు అందించిన నేపథ్యంలో ఉపాధ్యాయుల వివరాలతో ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పురపాలక బడుల్లో కలిపి 14,350 పోస్టులు ఉండగా.. వీటిల్లో 12,529మంది పని చేస్తున్నారు. ఎస్జీటీ పోస్టులు 1,366 ఖాళీగా ఉండగా.. సబ్జెక్టు టీచర్ల పోస్టులు 435 ఖాళీ ఉన్నట్లు పేర్కొంది.

ఇంటర్‌ విద్య విలీనానికి కమిటీల ఏర్పాటు

పాఠశాల విద్యలో ఇంటర్మీడియట్‌ విద్యను కలిపేసేందుకు ఉప కమిటీలను ఏర్పాటు చేస్తూ పాఠశాల విద్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగుల సర్వీసులు, పరీక్షల నిర్వహణ, గురుకులాలు, కరిక్యులమ్‌, శిక్షణ, మదింపు, వృత్తి విద్య అంశాల పరిశీలనకు కమిటీలను ఏర్పాటు చేసింది. అవి అయా అంశాలపై అధ్యయనం చేసి, నివేదిక సమర్పిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని