కియాపై నాడు అక్కసు.. నేడు పొగడ్తలు

‘నవ్విపోదురుగాక మాకేటి సిగ్గు... మా నోటికొచ్చింది మేం మాట్లాడతాం. రాజకీయ లబ్ధి కోసం అవసరమైతే మాట మార్చేస్తాం. మడమా తిప్పేస్తాం’... అంటున్నారు వైకాపా నాయకులు.

Updated : 21 Jan 2023 11:16 IST

ఎంపీ విజయసాయిరెడ్డి తీరు

ఈనాడు, అమరావతి: ‘నవ్విపోదురుగాక మాకేటి సిగ్గు... మా నోటికొచ్చింది మేం మాట్లాడతాం. రాజకీయ లబ్ధి కోసం అవసరమైతే మాట మార్చేస్తాం. మడమా తిప్పేస్తాం’... అంటున్నారు వైకాపా నాయకులు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కియా కార్ల పరిశ్రమలో ఉత్పత్తయిన ఒక మోడల్‌ కారుకు 2023 సంవత్సరానికి ‘ఇండియా కార్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డు రావడంతో ఆ కంపెనీపై పొగడ్తలు కురిపిస్తూ సాయిరెడ్డి చేసిన ట్వీట్‌ని, వైకాపా విపక్షంలో ఉన్నప్పుడు అదే కియాపై తన కడుపుమంటనంతా ప్రదర్శిస్తూ చేసిన ట్వీట్‌నీ చూస్తే... నాలుక మడతేసే అంశంలో పోటీ పెడితే సాయిరెడ్డిని మించినవాళ్లు  వైకాపాలోనూ ఎవరూ లేరనిపిస్తుంది.


కియాపై అప్పట్లో అక్కసు ఇలా..

‘కార్లు అమ్ముడుపోని కారణంగా కియా మోటార్స్‌ చైనాలోని అతి పెద్ద ప్లాంటును మూసేసింది. మరి రాష్ట్రంలో ఏర్పాటవుతున్న ప్లాంటు సంగతేమిటో? కమీషన్ల కక్కుర్తితో కియా మోటార్స్‌కు చంద్రబాబు రూ.2వేలకోట్ల రాయితీలిచ్చాడు. కంపెనీ ఉద్యోగుల్లో స్థానికులు వందమందికి మించి లేరు.’

ఇది 2019 మార్చి 11న విజయసాయిరెడ్డి ట్విటర్‌లో వెళ్లగక్కిన అక్కసు


శెభాష్‌ కియా అంటూ ఇప్పుడు పొగడ్తలు

‘ఆంధ్రప్రదేశ్‌లో తయారైన కియా కరెన్స్‌... ఇండియన్‌ కార్‌ ఆఫ్‌ ద ఇయర్‌- 2023 అవార్డు గెలుచుకోవడం గర్వకారణం. 2019లో 57,719 కార్లను ఉత్పత్తి చేసిన కియా పరిశ్రమ 2021లో 2.27 లక్షల కార్ల ఉత్పత్తి స్థాయికి చేరుకోవడాన్ని చూసి గర్విస్తున్నాం. కియా ఏపీలో ఉత్పత్తి చేసి ప్రపంచానికి ఎగుమతి చేస్తోంది.’

అదే విజయసాయిరెడ్డి శుక్రవారం చేసిన ట్వీట్‌ ఇది


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని