దేశ పురోగతికి ఆశాజనకమైన బడ్జెట్‌

ప్రపంచ వ్యాప్తంగా ముంచుకొస్తున్న ఆర్థిక మాంద్యం, దేశంలో ద్రవ్యోల్బణం, క్షేత్ర స్థాయిలోని అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టినట్టు అర్థమవుతోందని సీఐఐ ఆంధ్రప్రదేశ్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎం.లక్ష్మీప్రసాద్‌, పలువురు పారిశ్రామిక వేత్తలు అభిప్రాయపడ్డారు.

Published : 02 Feb 2023 03:39 IST

సీఐఐ ఆంధ్రప్రదేశ్‌ సమావేశంలో పారిశ్రామికవేత్తలు

ఈనాడు, అమరావతి: ప్రపంచ వ్యాప్తంగా ముంచుకొస్తున్న ఆర్థిక మాంద్యం, దేశంలో ద్రవ్యోల్బణం, క్షేత్ర స్థాయిలోని అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టినట్టు అర్థమవుతోందని సీఐఐ ఆంధ్రప్రదేశ్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎం.లక్ష్మీప్రసాద్‌, పలువురు పారిశ్రామిక వేత్తలు అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశ పురోగతికి ఈ బడ్జెట్‌ చాలా ఆశాజనకంగా ఉందని, వేతనజీవులకు ఊరట కలిగించే పలు అంశాలున్నాయని పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్‌ నేపథ్యంలో బుధవారం సీఐఐ ఆంధ్రప్రదేశ్‌ ఆధ్వర్యంలో విజయవాడలో సమావేశం ఏర్పాటు చేశారు. లక్ష్మీప్రసాద్‌ మాట్లాడుతూ.. వ్యవసాయ రంగానికి తాజా బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యం ఇచ్చారన్నారు. పిల్లలు, పెద్దలకు ఉపయోగపడేలా నేషనల్‌ డిజిటల్‌ లైబ్రరీలు, డిజిటల్‌ ఎడ్యుకేషన్‌కు ప్రాధాన్యం ఇవ్వడం మంచి పరిణామమని పేర్కొన్నారు.


భవిష్యత్‌ మార్పులపై దృష్టిపెట్టాలి

నేతి ఉమామహేశ్వరరావు, ఏపీ ఫ్రొఫెషనల్‌ ఫోరమ్‌ అధ్యక్షుడు

డ్జెట్‌లో వ్యయం రూ.45 లక్షల కోట్లు ఉంటే, వచ్చే ఆదాయం రూ.26 లక్షల కోట్లు. మిగిలింది ఆస్తులు అమ్మడం, రుణాల ద్వారా తెచ్చుకోవాలి. ఇది బాధాకరం. రక్షణ రంగానికి కేటాయించిన బడ్జెట్‌ గురించి చెప్పి పాక్‌, చైనా మనల్ని చూసి భయపడుతున్నాయని పేర్కొన్నారు. దేశంలో ఎమోషనల్‌ పాలిటిక్స్‌ కంటే.. భవిష్యత్‌ మార్పులు ఏమేమిరాబోతున్నాయి? యువతలో నైపుణ్యాన్ని పెంచేందుకు ఏం చర్యలు తీసుకోవాలి? విద్యా ప్రమాణాలు మెరుగుపర్చడం, పరిశోధనల పెంపు.. వంటి వాటిపై ఆలోచన చేయాలి. పశ్చిమదేశాల్లో మాదిరిగా విద్య, వైద్యం ఉచితం చేస్తే, మధ్యతరగతి వారికి ఎంతో ఊరట. ఎన్నికల బడ్జెట్‌ అయినా ఎక్కువ తాయిలాలు లేకపోవడం కూడా ఉపశమనమే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని