బహిరంగంగా పుట్టినరోజు సంబరాలు.. వైకాపా ఎమ్మెల్యేకు 144 సెక్షన్‌ వర్తించదా?

నిబంధనలు ప్రతిపక్షాలకే తప్ప అధికార పార్టీ వారికి కాదన్నట్లు పోలీసులు వ్యవహరిస్తున్నారు.

Updated : 13 Sep 2023 09:22 IST

ఈనాడు డిజిటల్‌ - నరసరావుపేట, నరసరావుపేట టౌన్‌- న్యూస్‌టుడే: నిబంధనలు ప్రతిపక్షాలకే తప్ప అధికార పార్టీ వారికి కాదన్నట్లు పోలీసులు వ్యవహరిస్తున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో 144 సెక్షన్‌, పోలీసు 30 యాక్ట్‌ అమల్లో ఉండగానే వైకాపా నేతలు సంబరాలు చేసుకున్నారు. నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకల్లో భాగంగా సోమవారం అర్ధరాత్రి వందల సంఖ్యలో వైకాపా కార్యకర్తలు గుంటూరు రోడ్డులోని ఆయన ఆసుపత్రి వద్దకు చేరుకుని బాణసంచా కాల్చారు. గజమాలతో ఎమ్మెల్యేను బహిరంగంగా సత్కరించారు. వారంతా రోడ్లపై హడావిడి చేసినా పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించారు. 144 సెక్షన్‌, పోలీసు 30 యాక్టు ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉన్నా స్వామిభక్తి ప్రదర్శించారని స్థానికులు చర్చించుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని