Andhra News: జగన్‌ మామయ్యా.. ఇదేనా అంతర్జాతీయ స్థాయి!

చిన్న గదిలో కిక్కిరిసిపోయి పడుకున్న ఈ పిల్లలు ప్రభుత్వ హాస్టల్‌ విద్యార్థులు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పట్టణ ఎస్సీ హాస్టల్‌ పెచ్చులూడి ప్రమాదకరంగా మారడంతో పక్కనున్న బడిలో ఇలా నిద్రించారు.

Updated : 23 Sep 2023 10:45 IST

చిన్న గదిలో కిక్కిరిసిపోయి పడుకున్న ఈ పిల్లలు ప్రభుత్వ హాస్టల్‌ విద్యార్థులు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పట్టణ ఎస్సీ హాస్టల్‌ పెచ్చులూడి ప్రమాదకరంగా మారడంతో పక్కనున్న బడిలో ఇలా నిద్రించారు. వసతి గృహ భవనం పెచ్చులూడి వర్షపు నీరు లోనికి వస్తోంది. పైగా కనీస సౌకర్యాలూ లేవు. విధిలేక విద్యార్థులు మూడు రోజులుగా సమీపంలోని ప్రాథమిక పాఠశాలలో పడుకుంటున్నారు. గురువారం రాత్రి ఓ చిన్న గదిలో 70 మంది సర్దుకుపోయారు. పడుకున్న వారు పక్కకు తిరగడానికీ స్థలం లేదక్కడ. విద్యా వ్యవస్థను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతున్నామని ఊదరగొడుతున్న సీఎం జగన్‌ మాటలకు.. క్షేత్ర పరిస్థితులకు ఏమాత్రం పొంతన లేదనడానికి ఈ విద్యార్థుల దుస్థితే నిదర్శనం.

న్యూస్‌టుడే, చాగల్లు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు