YSRCP: ఎమ్మెల్యే కుమారుడైతే ఎక్కడైనా కూర్చోవచ్చా!

వైకాపా నాయకులు ప్రభుత్వ కార్యక్రమాన్ని కూడా పార్టీ కార్యక్రమంగా మార్చేస్తున్నారు. ప్రొటోకాల్‌ ప్రకారం సీఎం వేదికపై ప్రజాప్రతినిధులు, అర్హత కలిగిన అధికారులు మాత్రమే కూర్చోవాలి.

Updated : 18 Nov 2023 07:53 IST

ఈనాడు, ఏలూరు: వైకాపా నాయకులు ప్రభుత్వ కార్యక్రమాన్ని కూడా పార్టీ కార్యక్రమంగా మార్చేస్తున్నారు. ప్రొటోకాల్‌ ప్రకారం సీఎం వేదికపై ప్రజాప్రతినిధులు, అర్హత కలిగిన అధికారులు మాత్రమే కూర్చోవాలి. కానీ నూజివీడులో పేదలకు పట్టాల పంపిణీ కార్యక్రమ సభావేదికపై ఎమ్మెల్యే ప్రతాప్‌ అప్పారావు కుమారుడు వేణుగోపాల అప్పారావు కూర్చోవడం వివాదాస్పదమైంది. అర్హత కలిగిన ఎమ్మెల్యేలు (కొందరు దళిత, గిరిజన ఎమ్మెల్యేలు ఉన్నారు), ఎంపీలు, మంత్రులు చివరి సీట్లలో కూర్చోగా ఆయన మాత్రం సీఎం సీటుకు అతి చేరువలో కూర్చున్నారు. దీంతో ఎమ్మెల్యే కుమారుడైతే ఎక్కడైనా కూర్చోవచ్చా అంటూ విమర్శలు వచ్చాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని