అధికారులకు వర్ణ అంధత్వం!

ఎన్నికల కోడ్‌ అమల్లోకొచ్చాక అధికారులు పక్షపాతాన్ని వదిలి పనిచేయాలి. కొందరు మాత్రం వైకాపా భక్తిని ప్రదర్శిస్తూనే ఉన్నారు.

Updated : 21 Mar 2024 06:11 IST

వైకాపా రంగుల్ని వదిలేస్తున్నారు 
పసుపుపై నలుపును పులుముతున్నారు

గుడివాడ గ్రామీణం, న్యూస్‌టుడే: ఎన్నికల కోడ్‌ అమల్లోకొచ్చాక అధికారులు పక్షపాతాన్ని వదిలి పనిచేయాలి. కొందరు మాత్రం వైకాపా భక్తిని ప్రదర్శిస్తూనే ఉన్నారు. కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపల్‌, రెవెన్యూ అధికారుల చర్యలే అందుకు నిదర్శనం. గుడివాడ మండలం మల్లాయపాలెంలోని టిడ్కో కాలనీ ఫ్లాట్లపై జగన్‌ స్టిక్కర్లను తొలగించకుండా చోద్యం చూస్తున్నారు.

గతంలో తెదేపా నేత వెనిగండ్ల రాము స్థానికంగా నిరుపేదలకు అందించిన తోపుడు బండ్లకు ఉన్న పసుపు రంగుపై కోడ్‌ పేరుతో అధికారులు నలుపురంగు వేయించారు. ఈ ఉదంతంపై తెదేపా నేతలు నిరసన తెలిపారు. టిడ్కో కాలనీలో 8,912 ఫ్లాట్ల గోడలపై సీఎం జగన్‌, ఎమ్మెల్యే కొడాలి నాని స్టిక్కర్లను అంటించారని, కిటికీలపైనా సీఎం స్టిక్కర్లు అలానే ఉన్నాయని, వాటిని తొలగించకుండా తోపుడు బండ్ల రంగును మార్చడం దారుణమని మండిపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని