ఆ రెండు గ్రామాలకు తాగునీటి సౌకర్యం

విద్యుత్తు కోసం లాంతర్లపై, తాగునీటి కోసం వాగుల్లోని చెలమలపై ఆధారపడి కాలం వెళ్లదీస్తున్న ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలోని బండారుగుంపు, రేగులగూడెం గ్రామాలకు అధికారులు మంగళవారం నీటి సౌకర్యం కల్పించారు.

Published : 27 Mar 2024 04:27 IST

‘ఈనాడు’ కథనానికి స్పందన

కుక్కునూరు, న్యూస్‌టుడే: విద్యుత్తు కోసం లాంతర్లపై, తాగునీటి కోసం వాగుల్లోని చెలమలపై ఆధారపడి కాలం వెళ్లదీస్తున్న ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలోని బండారుగుంపు, రేగులగూడెం గ్రామాలకు అధికారులు మంగళవారం నీటి సౌకర్యం కల్పించారు. జలజీవన్‌ మిషన్‌ ద్వారా రూ.28 లక్షలతో తాగునీటి పథకం ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈఈ వీరాస్వామి తెలిపారు. స్థానికుల అవస్థలపై ‘ఆ రెండు గ్రామాలు గుర్తున్నాయా’ శీర్షికన మంగళవారం ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఉదయమే గ్రామాలకు వెళ్లి ఆరు చేతి పంపులకు మరమ్మతులు చేపట్టారు. శాశ్వత చర్యల్లో భాగంగా జలజీవన్‌ మిషన్‌ ద్వారా తాగునీటి పథకం ఏర్పాటు చేస్తామన్నారు. మరోవైపు సోలార్‌ విద్యుత్తు పరికరాలను బాగు చేయడానికి ఉన్నతాధికారులకు లేఖ రాసినట్లు సంబంధిత శాఖ డీఈ రాధాకృష్ణ తెలిపారు. అనుమతులు రాగానే విద్యుత్తు లైన్‌ కూడా వేయనున్నట్లు ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని