పింఛను భిక్ష కాదు.. ఉద్యోగుల హక్కు

పింఛను పొందడం ఉద్యోగుల హక్కు అని.. ప్రభుత్వం ఇచ్చే భిక్ష కాదని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక ఛైర్మన్‌ కేఆర్‌ సూర్యనారాయణ పేర్కొన్నారు.

Updated : 19 Apr 2024 06:16 IST

ఈనాడు, ఒంగోలు: పింఛను పొందడం ఉద్యోగుల హక్కు అని.. ప్రభుత్వం ఇచ్చే భిక్ష కాదని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక ఛైర్మన్‌ కేఆర్‌ సూర్యనారాయణ పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యలపై ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఒంగోలులో గురువారం నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడటమే లక్ష్యంగా ప్రభుత్వాలను ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు.


కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌గా వెంకటేశ్వర్‌

ఈనాడు, అమరావతి: రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌గా డాక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌కు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వైద్య విధాన పరిషత్‌ (సెకండరీ హెల్త్‌ అండ్‌ ప్రాజెక్టు) కమిషనర్‌గా ఉంటూ ఇటీవల వ్యక్తిగత పర్యటన నిమిత్తం విదేశాలకు వెళ్లిన ఆయన గురువారం విధుల్లో చేరారు.


మే 13న కార్మికులు, ఉద్యోగులకు సెలవు

ఈనాడు, అమరావతి: ఏపీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ జరిగే మే 13న ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఏపీ దుకాణాలు, సంస్థల చట్టం కింద ఉద్యోగులు, కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని కార్మిక శాఖ కమిషనర్‌ శేషగిరిబాబు ఆదేశాలు జారీ చేశారు. సెలవు ఇచ్చినందుకు వేతనంలో ఎలాంటి తగ్గింపు చేయరాదని సూచించారు. ఈ నిబంధన ఉల్లంఘిస్తే యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని