Stock Market: భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు!

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు ఉన్నాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా కదలాడుతున్నాయి....

Published : 22 Nov 2021 09:33 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు ఉన్నాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా కదలాడుతున్నాయి. ఐరోపా దేశాల్లో కరోనా కేసులు పెరగడం సెంటిమెంటును దెబ్బతీసింది. జర్మనీలో ఇప్పటికే లాక్‌డౌన్ విధించగా.. ఆస్ట్రియా సహా మరికొన్ని దేశాలూ అదే బాటలో పయనిస్తున్నాయి. ఈ వారంలోనే నవంబరు నెలవారీ ఎక్స్‌పైరీ కూడా ఉంది. మరోవైపు గతవారం నిఫ్టీ సూచీ 50 రోజుల మూవింగ్‌ యావరేజీ కిందకు వెళ్లడంతో ట్రేడింగ్‌ బలహీనంగా ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఫార్మా సూచీ బలహీనంగా ఉంది. ఇక రిలయన్స్‌-ఆరామ్‌కో మధ్య కుదిరిన ఒప్పందం దాదాపు రద్దయినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ ప్రభావం కూడా సూచీలపై కనిపించే అవకాశం ఉంది. ఇక గత గురువారం స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో లిస్టయిన పేటీఎం ఐపీఓ నిరాశపరచడం కూడా మదుపర్ల సెంటిమెంటును దెబ్బతీయొచ్చు. ఈ పరిణామాల నేపథ్యంలో సూచీలు నేడు బలహీనంగా ట్రేడయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 

ఉదయం 9:24 గంటల సమయంలో సెన్సెక్స్‌ 434 పాయింట్ల నష్టంతో 59,201 వద్ద.. నిఫ్టీ 134 పాయింట్ల నష్టంతో 17,630 వద్ద ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.33 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో భారతీ ఎయిర్‌టెల్‌, పవర్‌గ్రిడ్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టీసీఎస్‌, ఎన్‌టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా, నెస్లే ఇండియా షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. రిలయన్స్‌, బజాజ్‌ ఫినాన్స్‌, ఎంఅండ్‌ఎం, మారుతీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఆటో, ఎల్‌అండ్‌టీ షేర్లు నష్టాల్లో పయనిస్తున్నాయి.

Read latest Business News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని