Air India sale: ఎయిరిండియా 96 గంటల సేల్‌.. టికెట్లపై రాయితీ

Fly Air India sale: టాటా గ్రూప్‌నకు చెందిన ఎయిరిండియా సంస్థ ప్రత్యేక సేల్‌ను ప్రకటించింది. ఆగస్టు 17 నుంచి 20 వరకు టికెట్ల బుకింగ్‌పై రాయితీలు ప్రకటించింది.

Published : 17 Aug 2023 17:34 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టాటా గ్రూప్‌నకు చెందిన విమానయాన సంస్థ ఎయిరిండియా (AirIndia) ‘ఫ్లై ఎయిరిండియా’ పేరిట 96 గంటల సేల్‌ను (Air India sale) ప్రారంభించింది. రాయితీ ధరలో దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలకు టికెట్లు బుక్‌ చేసుకునే వచ్చని ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఆగస్టు 17 నుంచి ఆగస్టు 20 రాత్రి వరకు ఈ సేల్‌ జరుగుతుంది. సెప్టెంబర్‌ 1 నుంచి అక్టోబర్‌ 31 మధ్య ఎంపిక చేసిన డొమెస్టిక్‌, ఇంటర్నేషనల్‌ రూట్లలో ప్రయాణానికి టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు.

దేశీయ ప్రయాణానికి ఎకానమీ క్లాస్‌ టికెట్‌ ధరలు రూ.1470 నుంచే ప్రారంభమవుతాయని ఎయిరిండియా తెలిపింది. బిజినెస్‌ క్లాస్‌ ధరలు రూ.10,130 నుంచి ప్రారంభమవుతాయని పేర్కొంది. ఎయిరిండియా వెబ్‌సైట్, మొబైల్‌ యాప్‌ ద్వారా టికెట్లు బుక్‌ చేసుకోవచ్చని తెలిపింది. ఎయిరిండియా మొబైల్‌ యాప్‌తో పాటు ఎయిరిండియా బుకింగ్‌ ఆఫీసు, ట్రావెల్‌ ఏజెంట్ల వద్ద కూడా టికెట్లను బుక్‌ చేసుకోవచ్చని ఎయిరిండియా తెలిపింది. 

సిమ్‌ డీలర్లకు ఇక పోలీస్‌ వెరిఫికేషన్‌.. కేంద్రం కీలక నిర్ణయం

ఆఫర్‌ సమయంలో ఎలాంటి కన్వీనియెన్స్‌ ఫీజూ వసూలు చేయబోమని పేర్కొంది. అలాగే గరిష్ఠంగా 15 శాతం వరకు టికెట్‌ బుకింగ్‌పై రాయితీ పొందొచ్చని తెలిపింది. రిటర్ను టికెట్లు కూడా బుక్‌ చేసుకున్న వారికి డబుల్‌ లాయల్టీ బోనస్‌ పాయింట్లు ఇస్తామని పేర్కొంది. అయితే, నిర్దేశించిన తేదీల్లో ప్రయాణానికి మాత్రమే ఈ ఆఫర్‌ వర్తిస్తుందని ఎయిరిండియా తెలపింది. అలాగే ఎంపిక చేసిన రూట్లలోనే సేల్‌ వర్తిస్తుందని పేర్కొంది. లిమిటెడ్‌ సీట్లు అందుబాటులో ఉంటాయని షరుతుల్లో పేర్కొంది. గ్రూప్ బుకింగ్స్‌కు ఈ రాయితీ ధరలు వర్తించవని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని