Budget 2023: పేద ఖైదీలకు అవసరమైన ఆర్థిక సాయం

పేద ఖైదీలకు కేంద్ర బడ్జెట్‌(Budget 2023)లో ఊరట కల్పించారు. బెయిల్‌ మొత్తాన్ని చెల్లించలేని వారికి ఆర్థికంగా సహకరించనున్నట్లు చెప్పారు.

Updated : 01 Feb 2023 14:17 IST

దిల్లీ: పెనాల్టీ లేదా బెయిల్ మొత్తాన్ని భరించలేని పేద ఖైదీలకు తోడ్పాటు అందించనున్నటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) వెల్లడించారు. ఈ అమృత్ కాలానికి పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన తొలి పద్దు(Budget 2023)లో మంత్రి ఈ విషయాన్నివెల్లడించారు. ‘బెయిల్‌ లేదా పెనాల్టీ మొత్తాలను భరించలేని  జైల్లో ఉన్న పేదలకు అవసరమైన ఆర్థిక సహాయం అందిస్తాం’ అని మంత్రి వెల్లడించారు. 

గత ఏడాది నిర్వహించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, ముఖ్యమంత్రులు సంయుక్త సదస్సు ప్రారంభ కార్యక్రమంలో ప్రధాన మంత్రి మాట్లాడుతూ.. జైల్లో మగ్గుతున్న అండర్‌ ట్రయల్‌ ఖైదీలకు సంబంధించిన కేసులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని అభ్యర్థించారు. అలాగే చట్టప్రకారం సున్నితత్వం ఆధారంగా వారిని విడుదల చేయాలని సూచించారు. ప్రతి జిల్లాలో జిల్లా న్యాయమూర్తి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయడం ద్వారా ఈ కేసులను సమీక్షించవచ్చని, అవసరమైన చోట ఖైదీలను బెయిల్‌పై విడుదల చేయొచ్చని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని