ఈ నెల 16 వరకూ ‘క్రోమా’ ఇండిపెండెన్స్‌ డే సేల్‌

టాటా గ్రూపు సంస్థ క్రోమా, 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పలు రకాలైన ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తులపై ఆకర్షణీయమైన రాయితీలు, డిస్కౌంట్లు ప్రకటించింది. ‘క్రోమా ఇండిపెండెన్స్‌ డే సేల్‌- 2022’ ఈ సదుపాయాన్ని ఈ నెల 5వ తేదీ నుంచి 16వ తేదీ దేశవ్యాప్తంగా ఉన్న తమ స్టోర్లలో అందిస్తున్నట్లు క్రోమా వెల్లడించింది. క్రోమా.కామ్‌ వెబ్‌సైట్లోనూ చేపట్టే కొనుగోళ్లకు ఈ రాయితీలు వర్తిస్తాయి.

Published : 12 Aug 2022 03:13 IST

ఈనాడు, హైదరాబాద్‌: టాటా గ్రూపు సంస్థ క్రోమా, 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పలు రకాలైన ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తులపై ఆకర్షణీయమైన రాయితీలు, డిస్కౌంట్లు ప్రకటించింది. ‘క్రోమా ఇండిపెండెన్స్‌ డే సేల్‌- 2022’ ఈ సదుపాయాన్ని ఈ నెల 5వ తేదీ నుంచి 16వ తేదీ దేశవ్యాప్తంగా ఉన్న తమ స్టోర్లలో అందిస్తున్నట్లు క్రోమా వెల్లడించింది. క్రోమా.కామ్‌ వెబ్‌సైట్లోనూ చేపట్టే కొనుగోళ్లకు ఈ రాయితీలు వర్తిస్తాయి. స్మార్ట్‌ టీవీలు, ల్యాప్‌టాప్‌, వాషింగ్‌ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు, స్మార్ట్‌ఫోన్లు, యాపిల్‌ ఐపాడ్‌లు, ఇంకా ఎన్నో రకాలైన ఉత్పత్తులపై ఆకర్షణీయమైన రాయితీలు, 20 శాతం వరకూ క్యాష్‌ బ్యాక్‌, 24 నెలల సులువైన వాయిదా పథకాలు అందిస్తున్నట్లు క్రోమా తెలియజేసింది. ఎంపిక చేసిన క్రెడిట్‌/ డెబిట్‌ కార్డులతో చెల్లింపులు చేస్తే 10 శాతం వరకూ డిస్కౌంట్‌ వెనువెంటనే లభిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని