సిమ్‌ మార్చకుండానే ‘5జీ’ సేవలు

వినియోగదార్లు కనుక 5జీ స్మార్ట్‌ఫోన్‌లో ఎయిర్‌టెల్‌ సిమ్‌ వాడుతుంటే, సిమ్‌ను మార్చకుండానే 5జీ సేవలను పొందొచ్చని భారతీ ఎయిర్‌టెల్‌ తెలిపింది. దిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, సిలిగురి, నాగ్‌పుర్, వారణాసి వినియోగదారులు 5జీ ప్లస్‌ సేవలను దశలవారీగా పొందొచ్చని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

Published : 07 Oct 2022 02:09 IST

దిల్లీ: వినియోగదార్లు కనుక 5జీ స్మార్ట్‌ఫోన్‌లో ఎయిర్‌టెల్‌ సిమ్‌ వాడుతుంటే, సిమ్‌ను మార్చకుండానే 5జీ సేవలను పొందొచ్చని భారతీ ఎయిర్‌టెల్‌ తెలిపింది. దిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, సిలిగురి, నాగ్‌పుర్, వారణాసి వినియోగదారులు 5జీ ప్లస్‌ సేవలను దశలవారీగా పొందొచ్చని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. నెట్‌వర్క్‌ నిర్మాణాన్ని కొనసాగిస్తుండటమే ఇందుకు కారణంగా పేర్కొంది. ‘సూపర్‌ ఫాస్ట్‌’ కాల్‌ కనెక్ట్‌తో 20-30 రెట్ల అధిక వేగం ఉంటుందని వెల్లడించింది. ‘ఏ 5జీ మొబైల్‌తోనైనా, ప్రస్తుతమున్న సిమ్‌పై 5జీ సేవలు అందించాలన్నదే తమ లక్ష్యమని భారతీ ఎయిర్‌టెల్‌ ఎండీ గోపాల్‌ విత్తల్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని