వెండిలో కొనుగోళ్లు!

పసిడి ఫిబ్రవరి కాంట్రాక్టు ఈవారం రూ.53,924 కంటే పైన కదలాడితే సానుకూల ధోరణికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ రూ.53,381 కంటే దిగువన చలిస్తే రూ.53,327; రూ.53,114 వరకు దిద్దుబాటు కావచ్చు.

Published : 05 Dec 2022 04:07 IST

కమొడిటీస్‌ ఈ వారం

బంగారం

పసిడి ఫిబ్రవరి కాంట్రాక్టు ఈవారం రూ.53,924 కంటే పైన కదలాడితే సానుకూల ధోరణికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ రూ.53,381 కంటే దిగువన చలిస్తే రూ.53,327; రూ.53,114 వరకు దిద్దుబాటు కావచ్చు. అమెరికా కీలక ఆర్థిక గణాంకాలు, ఇతర అంతర్జాతీయ పరిణామాలు పసిడి కాంట్రాక్టుకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది.

* ఎంసీఎక్స్‌ బుల్‌డెక్స్‌ డిసెంబరు కాంట్రాక్టు రూ.14,986 కంటే పైన కదలాడితే మరింతగా పెరగొచ్చు. అందువల్ల స్టాప్‌లాస్‌ను సవరిస్తూ లాంగ్‌ పొజిషన్లను అట్టేపెట్టుకోవచ్చు.


వెండి

వెండి మార్చి కాంట్రాక్టు రూ.64,325 కంటే కిందకు రాకుంటే కొనుగోళ్లను కొనసాగించొచ్చు. ఒకవేళ కిందకు వచ్చినా.. ధర తగ్గినప్పుడల్లా లాంగ్‌ పొజిషన్లు జతచేసుకోవడం మంచి వ్యూహమే అవుతుంది.


ప్రాథమిక లోహాలు

* రాగి డిసెంబరు కాంట్రాక్టు రూ.696 పైన కదలాడితే రూ.708; రూ.713.75 వరకు రాణించొచ్చు. ఒకవేళ రూ.679 కంటే కిందకు వస్తే.. దిద్దుబాటుకు ఆస్కారం ఉంటుంది.

* సీసం డిసెంబరు కాంట్రాక్టు రూ.184 దిగువన బలహీనంగా కన్పిస్తోంది. రూ.191 ఎగువన చలిస్తే మాత్రం.. మరింత పెరగొచ్చు.

* జింక్‌ డిసెంబరు కాంట్రాక్టు రూ.272 కంటే పైన కదలాడకుంటే.. షార్ట్‌ సెల్‌ పొజిషన్లు తీసుకోవడం మంచిదే. రూ.266; రూ.263 వరకు దిగివచ్చే అవకాశం ఉంది.

* అల్యూమినియం డిసెంబరు కాంట్రాక్టు రూ.207 దిగువన చలించకుంటే.. కొంత మేర రాణిస్తుంది. ఈ స్థాయి కంటే కిందకు వస్తే అమ్మకాల ఒత్తిడికి ఆస్కారం ఉంటుంది.


ఇంధన రంగం

* ముడి చమురు డిసెంబరు కాంట్రాక్టు రూ.6,275 కంటే దిగువన కదలాడకుంటే.. రూ.6,868; రూ.7,022 వరకు పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ రూ.6,275 కంటే కిందకు వస్తే. రూ.6,135; రూ.5,933 వరకు దిద్దుబాటు కావచ్చు.

* సహజ వాయువు డిసెంబరు కాంట్రాక్టు రూ.466 కంటే దిగువన కదలాడకుంటే కొనుగోళ్లకు మొగ్గు చూపడం మంచిదే. ఒకవేళ పైకి వెళితే రూ.555 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయినీ అధిగమిస్తే.. రూ.580 వరకు పెరుగుతుంది.


వ్యవసాయ ఉత్పత్తులు

* పసుపు డిసెంబరు కాంట్రాక్టు రూ.7,008 కంటే దిగువన చలించకుంటే.. రెండు వారాల గరిష్ఠమైన రూ.7,550ను తాకే అవకాశం ఉంటుంది. రూ.7,008 కంటే కిందకు వస్తేనే షార్ట్‌ సెల్‌ పొజిషన్ల జోలికి వెళ్లాలి.

* జీలకర్ర డిసెంబరు కాంట్రాక్టు రూ.22,763- రూ.26,781 శ్రేణిలో చలించొచ్చు.

* ధనియాలు డిసెంబరు కాంట్రాక్టు రూ.9,246 కంటే దిగువన కదలాడితే మరింత దిద్దుబాటు అవ్వొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని