బడ్జెట్ ముందు కొనుగోళ్లు
బడ్జెట్‌కు ముందు మదుపర్ల కొనుగోళ్లతో సూచీలు స్వల్పంగా రాణించాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల ప్రకటన వెలువడనున్నందున, ఆచితూచి వ్యవహరించారు.
బడ్జెట్‌కు ముందు మదుపర్ల కొనుగోళ్లతో సూచీలు స్వల్పంగా రాణించాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల ప్రకటన వెలువడనున్నందున, ఆచితూచి వ్యవహరించారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి 36 పైసలు తగ్గి 81.88 వద్ద ముగిసింది. బ్యారెల్ ముడిచమురు 1.18 శాతం నష్టంతో 83.90 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లు నష్టాల్లో ముగియగా, ఐరోపా సూచీలు బలహీనంగా కదలాడాయి. సెన్సెక్స్ ఉదయం 59,770.83 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. వెంటనే నష్టాల్లోకి జారుకుని, 59,104.59 పాయింట్ల వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. మధ్యాహ్నం తర్వాత కోలుకున్న సెన్సెక్స్.. 49.49 పాయింట్ల లాభంతో 59,549.90 వద్ద ముగిసింది. నిఫ్టీ 13.20 పాయింట్లు పెరిగి 17,662.15 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 17,537.55- 17,735.70 పాయింట్ల మధ్య కదలాడింది.
* సెన్సెక్స్ 30 షేర్లలో 15 రాణించాయి. ఎం అండ్ ఎం 3.53%, అల్ట్రాటెక్ 2.96%, ఎస్‌బీఐ 2.85%, ఐటీసీ 2.21%, పవర్‌గ్రిడ్ 2.17%, టాటా మోటార్స్ 1.94%, టైటన్ 1.80%, ఎన్‌టీపీసీ 1.36%, ఐసీఐసీఐ బ్యాంక్ 1.03% చొప్పున మెరిశాయి. టీసీఎస్ 2.27%, బజాజ్ ఫైనాన్స్ 2.26%, టెక్ మహీంద్రా 2.01%, సన్‌ఫార్మా 1.51%, ఏషియన్ పెయింట్స్ 1.43%, హెచ్‌సీఎల్ టెక్ 1.03% నష్టపోయాయి.
* నేటి (ఫిబ్రవరి 1) నుంచి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లు టీ+2 సెటిల్‌మెంట్ వ్యవస్థకు మారనున్నాయి.
* బీఎస్‌ఈ ఎస్‌ఎంఈ ప్లాట్‌ఫామ్‌పై ధరణి క్యాపిటల్ సర్వీసెస్ షేరు నమోదైంది.
* అమెరికా టవర్ కార్పొరేషన్‌కు రూ.1600 కోట్ల వరకు ఆప్షనల్లీ కన్వెర్టబుల్ డిబెంచర్లను జారీ చేసేందుకు వొడాఫోన్ ఐడియా బోర్డు ఆమోదం తెలిపింది. ఇందుకు అనుమతి కోరేందుకు ఫిబ్రవరి 25న కంపెనీ అసాధారణ వాటాదార్ల సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది.
* గనుల్లో వినియోగిస్తున్న 900కు పైగా డీజిల్ వాహనాల నుంచి విద్యుత్ వాహనాలకు మారేందుకు, వచ్చే అయిదేళ్లలో బిలియన్ డాలర్ల (దాదాపు రూ.8,200 కోట్లు) పెట్టుబడులను వేదాంతా గ్రూప్ సంస్థ హిందుస్థాన్ జింక్ ప్రకటించింది.
నేటి బోర్డు సమావేశాలు
టాటా కెమికల్స్, అశోక్ లేలాండ్, బ్రిటానియా, అజంతా ఫార్మా, హిందుస్థాన్ కాపర్, యూటీఐ ఏఎంసీ, వర్ల్‌పూల్, జువారి అగ్రో కెమికల్స్, ఐడీఎఫ్‌సీ, రేమండ్, జిలెట్, ఆర్‌పీజీ లైఫ్ సైన్సెస్, ఆర్‌ఎస్ సాఫ్ట్‌వేర్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Ap-top-news News
Rains: మూడు రోజులు తేలికపాటి వర్షాలు
-
India News
కన్నతండ్రి దూరమైనా తరగని ప్రేమ.. భౌతికకాయం ముందే పెళ్లి చేసుకున్న కుమారుడు
-
India News
Usha Gokani: మహాత్మాగాంధీ మనవరాలి కన్నుమూత
-
Politics News
TDP: ఎమ్మెల్యే భవాని సభలో లేకున్నా ‘సాక్షి’లో తప్పుడు ఫొటో: తెదేపా ఎమ్మెల్యే స్వామి
-
India News
the elephant whisperers: ఆస్కార్ లఘుచిత్ర దర్శకురాలికి రూ.కోటి నజరానా