ఆన్‌లైన్‌ గేమ్‌లపై 30% టీడీఎస్‌

ఆన్‌లైన్‌ గేమ్‌లలో గెలుపొందిన నికర మొత్తంపై 30 శాతం పన్నును ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రస్తుత రూ.10,000 గరిష్ఠ పరిమితిని ఎత్తివేసింది.  

Published : 02 Feb 2023 03:28 IST

ఆన్‌లైన్‌ గేమ్‌లలో గెలుపొందిన నికర మొత్తంపై 30 శాతం పన్నును ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రస్తుత రూ.10,000 గరిష్ఠ పరిమితిని ఎత్తివేసింది.  ఒక వేళ వినియోగదారు ఖాతా నుంచి నగదు ఉపసంహరణ జరగకపోతే.. ఆర్థిక సంవత్సరం చివర్లో మూలం వద్ద పన్నును మినహాయించుకుంటారు. నికరంగా గెలుపొందిన సగటు విలువపైనే పన్ను ఉంటుందని రెవెన్యూ కార్యదర్శి సంజయ్‌ మల్హోత్రా స్పష్టం చేశారు. గరిష్ఠ పరిమితి కంటే తక్కువగా ఉన్న గెలుపొందిన మొత్తాన్ని కొన్ని కంపెనీలు అట్టేపెట్టి ఉంచుకుని, టీడీఎస్‌ నిబంధనల కిందకు రాకుండా చూసుకుంటున్నట్లు పన్ను విభాగం దృష్టికి రావడంతో గరిష్ఠ పరిమితిని ఎత్తివేసినట్లు మల్హోత్రా పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని