2024 అక్టోబరు 1 నుంచి తప్పనిసరి ఫిట్‌నెస్‌ టెస్టింగ్‌

భారీ, మధ్యస్థాయి సరకు రవాణా, ప్రయాణికుల వాహనాలకు తప్పనిసరిగా ఆటోమేటెడ్‌ టెస్టింగ్‌ స్టేషన్ల ద్వారా ఫిట్‌నెస్‌ టెస్ట్‌ నిర్వహించాలన్న నిబంధనను కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది అక్టోబరు 1కి వాయిదా వేసింది.

Published : 01 Apr 2023 02:34 IST

ఈనాడు, దిల్లీ:  భారీ, మధ్యస్థాయి సరకు రవాణా, ప్రయాణికుల వాహనాలకు తప్పనిసరిగా ఆటోమేటెడ్‌ టెస్టింగ్‌ స్టేషన్ల ద్వారా ఫిట్‌నెస్‌ టెస్ట్‌ నిర్వహించాలన్న నిబంధనను కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది అక్టోబరు 1కి వాయిదా వేసింది. భారీ సరుకు రవాణా, ప్రయాణికుల రవాణా వాహనాలకు ఏప్రిల్‌ 1 నుంచి, మధ్యస్థాయి సరుకు, ప్రయాణికుల రవాణా వాహనాలు, తేలికపాటి మోటారు వాహనాలకు 2024 జూన్‌ 1 నుంచి ఆటోమేటెడ్‌ టెస్టింగ్‌ స్టేషన్ల ద్వారానే ఫిట్‌నెస్‌ టెస్ట్‌ నిర్వహించాలని 2022 ఏప్రిల్‌ 5న కేంద్ర రహదారి రవాణాశాఖ నోటిఫికేషన్‌ జారీచేసింది. అయితే దేశంలో అనుకున్నంత స్థాయిలో ఆటోమేటెడ్‌ టెస్టింగ్‌ స్టేషన్లు ఏర్పాటు కానందున, తప్పనిసరి టెస్టింగ్‌ తేదీని 2024 అక్టోబరు 1కి వాయిదావేస్తూ, శుక్రవారం ఉత్తర్వులు వెలువరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని