టీసీఎస్, టీడీఎస్ వివరాలు ఒకే చోట
ఆదాయపు పన్ను వివరాల్లో మరింత స్పష్టత తీసుకొచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా వ్యక్తులు కొనుగోళ్ల సమయంలో చేసిన ‘మూలం వద్ద చెల్లించిన పన్ను (టీసీఎస్), వివిధ ఆదాయాలను ఆర్జించినప్పుడు మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్)’ వివరాలను ఒకే చోటకు తీసుకురాబోతున్నట్లు ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) వి అనంత నాగేశ్వరన్ తెలిపారు.
దిల్లీ: ఆదాయపు పన్ను వివరాల్లో మరింత స్పష్టత తీసుకొచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా వ్యక్తులు కొనుగోళ్ల సమయంలో చేసిన ‘మూలం వద్ద చెల్లించిన పన్ను (టీసీఎస్), వివిధ ఆదాయాలను ఆర్జించినప్పుడు మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్)’ వివరాలను ఒకే చోటకు తీసుకురాబోతున్నట్లు ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) వి అనంత నాగేశ్వరన్ తెలిపారు. అంతర్జాతీయ లావాదేవీలపై 20% టీసీఎస్ వసూలు చేయబోతున్న నేపథ్యంలో ఇది కీలకం కాబోతోంది. రూ.7లక్షల లోపు అంతర్జాతీయ లావాదేవీలు టీసీఎస్ పరిధిలో ఉండవు. కాబట్టి, 20 శాతం పరిధిలోకి వచ్చే లావాదేవీలు చాలా తక్కువగా ఉంటాయి. అధిక మొత్తంలో చేసే ఖర్చులను 1% టీసీఎస్‌తోనూ పరిశీలించవచ్చని, 5% ఎందుకు అనే ప్రశ్నలూ వస్తున్నాయి. కానీ, చాలామంది 1% లేదా 5% చెల్లించి, పన్ను పరిధికి దూరంగా ఉన్నారు. కాబట్టి, ఒక నియంత్రణ ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రభుత్వం వద్ద అందరి సమాచారమూ ఉంటుంది. కొంతమంది దుర్వినియోగం చేసినా, లావాదేవీల విలువలే ముఖ్యం అని పేర్కొన్నారు. ప్రస్తుతం విదేశీ వైద్య చికిత్స, విద్యా ఖర్చులు ఏడాదికి రూ.7 లక్షల లోపు ఉన్నప్పుడు టీసీఎస్ నుంచి మినహాయించారు. రూ.7లక్షలు దాటినప్పుడు 5% టీసీఎస్ వర్తిస్తుంది. విద్యా రుణాలు తీసుకున్న వారికి టీసీఎస్ 0.5 శాతమే ఉంటుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Crime News: కూతురి ప్రేమను కాదన్నందుకు.. ప్రియుడితో కలిసి తల్లి హత్య
-
Ts-top-news News
Telangana: ఉడుకుతున్న రాష్ట్రం.. గరిష్ఠంగా 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత
-
Ap-top-news News
చింతలపూడి ఏరియా ఆసుపత్రిలో చీకట్లు.. ఉక్కపోతలో రోగులు
-
Sports News
ఆస్ట్రేలియా వికెట్ పడింది.. లబుషేన్ నిద్ర లేచాడు
-
Movies News
ఇలియానా వెబ్‌సిరీస్ అప్పుడే!
-
Sports News
WTC Final: గిల్ అంటే కుర్రాడు.. నీకేమైంది పుజారా..?: రవిశాస్త్రి ఆగ్రహం