ఆసియా- ప్రపంచ వృద్ధికి కీలకంగా భారత్‌

ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ 2014లో బాధ్యతలు చేపట్టాక, భారత్‌ తీరు గొప్పగా రూపాంతరం చెందిందని, ఆసియా అభివృద్ధికే కాదు.. అంతర్జాతీయ వృద్ధికీ కీలకంగా మారుతోందని ప్రముఖ బ్రోకరేజీ సంస్థ మోర్గాన్‌ స్టాన్లీ తాజా నివేదికలో ప్రశంసించింది.

Published : 01 Jun 2023 02:29 IST

9 ఏళ్లలో ఎంతో రాణించింది: మోర్గాన్‌స్టాన్లీ  

దిల్లీ: ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ 2014లో బాధ్యతలు చేపట్టాక, భారత్‌ తీరు గొప్పగా రూపాంతరం చెందిందని, ఆసియా అభివృద్ధికే కాదు.. అంతర్జాతీయ వృద్ధికీ కీలకంగా మారుతోందని ప్రముఖ బ్రోకరేజీ సంస్థ మోర్గాన్‌ స్టాన్లీ తాజా నివేదికలో ప్రశంసించింది. గత పాతికేళ్లుగా రెండో అత్యంత వేగవంతమైన రెండో ఆర్థిక వ్యవస్థగా, స్టాక్‌ మార్కెట్ల పనితీరులో అగ్రగామి దేశాల్లో ఒకటిగా ఉన్నా.. భారత తన సత్తాకు తగ్గట్లుగా రాణించడం లేదన్న విమర్శలు సరికాదని సంస్థ  పేర్కొంది. గత తొమ్మిదేళ్లలో వ్యవస్థాపక సంస్కరణలు అమల్లోకి వచ్చాయని తెలిపింది. ‘2013లో ఉన్న భారత్‌కు.. ఇప్పటి దేశానికి చాలా వ్యత్యాసం ఉంది. మోదీ ఆధ్వర్యంలో తీసుకొచ్చిన 10 అతిపెద్ద మార్పులు మేలు చేస్తున్నాయి. కార్పొరేట్‌ పన్నును ఇతర దిగ్గజ ఆర్థిక వ్యవస్థలతో సమానస్థాయికి తేవడం, జీఎస్‌టీ వసూళ్లను పెంచుకోవడం, జీడీపీలో డిజిటల్‌ లావాదేవీల వాటా పెరిగేలా చేయడం, దివాలా స్మృతి, ద్రవ్యోల్బణ లక్ష్యం తీరు, ఎఫ్‌డీఐపై దృష్టి, లబ్ధిదారులకు నేరుగా ఖాతాల్లో ప్రభుత్వ రాయితీ పడేలా చేయడం, కార్పొరేట్‌ లాభాలకు ప్రభుత్వ మద్దతు, స్థిరాస్తి రంగంలో పారదర్శకతకు కొత్త చట్టం, ఎమ్‌ఎన్‌సీ సెంటిమెంటును గరిష్ఠ స్థాయిలకు తీసుకెళ్లడం’ ఎంతో ఉపకరించినట్లు వివరించింది.

* ఎగుమతి మార్కెట్‌లో భారత వాటా 2031 కల్లా రెట్టింపునకు మించి 4.5 శాతానికి చేరొచ్చని అంచనా వేసింది. భారతీయుల తలసరి ఆదాయం ఇపుడున్న 2200 డాలర్ల నుంచి 2032 కల్లా 5,200 డాలర్లకు చేరగలదనీ అంచనా వేసింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు