APY New Rule: ఇక‌పై వారు ఈ ప‌థ‌కంలో పెట్టుబ‌డి పెట్ట‌లేరు..!

నోటిఫికేష‌న్ ప్ర‌కారం, అక్టోబ‌రు 1, 2022 త‌ర్వాత ఆదాయ‌పు ప‌న్ను చెల్లింపుదారుల‌కు అట‌ల్ పెన్ష‌న్ యోజ‌న ప‌థ‌కంలో చేరేందుకు అర్హ‌త ఉండ‌దు.

Published : 11 Aug 2022 11:38 IST

కేంద్ర ప్ర‌భుత్వం అందిస్తున్న..సామాజిక భ‌ద్ర‌తా ప‌థ‌కాల‌లో ప్ర‌సిద్ధి చెందిన ప‌థ‌కం, అట‌ల్ పెన్ష‌న్ యోజ‌న‌. ఇది అసంఘ‌టిత రంగంలోని కార్మికుల ప‌ద‌వీ విర‌మ‌ణ జీవితం కోసం ఉద్ద్యేశించిన‌ పెన్ష‌న్ ప‌థ‌కం. ఇందులో పెట్టుబ‌డులు పెట్టిన వారికి, 60 ఏళ్ల వ‌య‌సు త‌ర్వాత‌ వారి వారి పెట్టుబ‌డుల‌కు అనుగుణంగా రూ. 1000 నుంచి రూ. 5000 వ‌ర‌కు నిర్ణీత పెన్ష‌న్ అందుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ ప‌థ‌కంలో 18 నుంచి 40 ఏళ్ల లోపు వ‌య‌సున్న భార‌తీయులెవ‌రైనా చేరేందుకు అర్హ‌త ఉంది. అయితే, తాజాగా కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన పెట్టుబడి నిబంధనలను సవరించింది, కొత్త నియ‌మాల ప్ర‌కారం ఆదాయ‌పు ప‌న్ను చెల్లించేవారికి ఏపీవైలో పెట్టుబ‌డి పెట్టేందుకు అర్హ‌త ఉండ‌దు. ఈ మేర‌కు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఆర్థిక సేవల విభాగం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ కొత్త రూల్స్ అక్టోబర్ 1, 2022 నుంచి అమ‌లులోకి రానున్నాయి.

నోటిఫికేష‌న్ ప్ర‌కారం, అక్టోబ‌రు 1, 2022 త‌ర్వాత ఆదాయ‌పు ప‌న్ను చెల్లింపుదారుల‌కు అట‌ల్ పెన్ష‌న్ యోజ‌న ప‌థ‌కంలో చేరేందుకు అర్హ‌త ఉండ‌దు. ఒక‌వేళ అక్టోబ‌రు 1, 2022 త‌ర్వాత‌ ప‌థ‌కంలో చేరేవారు..ద‌ర‌ఖాస్తు చేసుకున్న నాట‌కి అత‌ను/ఆమె ప‌న్ను ప‌రిధిలోకి వ‌చ్చిన‌ట్లు గుర్తిస్తే, అటువంటి ఖాతాల‌ను ర‌ద్దు చేసి అప్ప‌టివ‌ర‌కు ఖాతాలో సమ‌కూరిన మొత్తాన్ని ద‌ర‌ఖాస్తుదారునికి తిరిగి చెల్లిస్తారు. ఇక్క‌డ "ఆదాయ-పన్ను చెల్లింపుదారు" అంటే..కాలానుగుణంగా సవరించబడిన ఆదాయపు పన్ను చట్టం, 1961 ప్రకారం ఆదాయపు పన్ను చెల్లించాల్సిన బాధ్యత ఉన్న‌ వ్యక్తి అని అర్థం.

ఏపీవై అనేది అసంఘ‌టిత రంగంలో ప‌నిచేస్తున్న ప్ర‌జ‌ల ప‌ద‌వీవిర‌మ‌ణ జీవితం కోసం ఆర్థిక స‌హాయాన్ని అందించ‌డానికి ప్రారంభించిన ప‌థ‌కం. కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న ఈ చ‌ర్య‌తో ఈ ప‌థ‌కం నిజ‌మైన వినియోగ‌దారుల‌ను చేరుతుంద‌ని నిపుణ‌లు అభిప్రాయప‌డుతున్నారు. 

ఏపీవై ప‌థ‌కం గురించిన పూర్తి వివ‌రాల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని