IT raids: డోలో-650 తయారీ సంస్థపై ఐటీ దాడులు.. కీలక పత్రాలు స్వాధీనం!
బెంగళూరు: పాపులర్ ఔషధం డోలో-650 (Dolo-650) తయారీ సంస్థ మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్‌పై (Micro Labs) ఐటీ శాఖ సోదాలు జరిపింది. బెంగళూరులోని రేస్ కోర్స్ రోడ్డులోని ఆ కంపెనీ కార్యాలయంలో దాదాపు 20మంది అధికారుల బృందం సోదాలు నిర్వహించారు. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో జరిపిన ఈ దాడుల్లో కార్యాలయంలో కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. అలాగే, దిల్లీ, సిక్కిం, పంజాబ్, తమిళనాడు, గోవాలతో పాటు దేశవ్యాప్తంగా 40 చోట్ల ఏకకాలంలో సోదాలు జరపగా.. 200 మందికి పైగా అధికారులు పాల్గొన్నట్టు ఐటీశాఖ వర్గాలు పేర్కొన్నాయి. మైక్రో ల్యాబ్స్ సీఎండీ దిలీప్ సురానా, డైరెక్టర్ ఆనంద్ సురానా నివాసాల్లోనూ సోదాలు నిర్వహించినట్టు సమాచారం. ఈ సోదాల్లో భాగంగా మాధవనగర్‌లోని రేస్‌కోర్సు రోడ్డులోని మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్ కార్యాలయంలో పలు కీలక పత్రాలు సేకరించినట్టు ఐటీశాఖ అధికారులు తెలుస్తోంది. 2020లో కరోనా వ్యాప్తి మొదలైనప్నట్నుంచి ఈ కంపెనీ రికార్డుస్థాయిలో 350 కోట్ల టాబ్లెట్లను విక్రయించింది. అంతేకాకుండా ఒకే ఏడాదిలో దాదాపు రూ.400 కోట్ల ఆదాయాన్ని ఆర్జించి అనేక కంపెనీలను అధిగమించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Sri Lanka Crisis: శ్రీలంకవాసులకు ‘షాక్’! విద్యుత్ ధరల్లో 264 శాతం పెంపు
-
Movies News
Nithiin: అందుకే మా సినిమాకు ‘మాచర్ల నియోజకవర్గం’ టైటిల్ పెట్టాం!
-
India News
Corona: ఖర్గేకు మళ్లీ కరోనా పాజిటివ్.. నిన్న రాజ్యసభలో మాట్లాడిన ప్రతిపక్ష నేత!
-
India News
Bihar politics: భాజపాకు నీతీశ్ కుమార్ ఝులక్.. నెట్టింట మీమ్స్ హల్చల్
-
India News
Kolkata: బికినీ ధరించిన ప్రొఫెసర్.. రూ.99కోట్లు కట్టాలంటూ యూనివర్సిటీ ఆదేశం!
-
Sports News
CWG 2022: మేం రజతం గెలవలేదు.. స్వర్ణం కోల్పోయాం: శ్రీజేశ్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Money: వ్యక్తి అకౌంట్లోకి రూ.6వేల కోట్లు.. పంపిందెవరు?
- Andhra news: నడిరోడ్డుపై వెంటాడి కానిస్టేబుల్ హత్య
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (09/08/2022)
- Chile sinkhole: స్టాట్యూ ఆఫ్ యూనిటీ మునిగేంతగా.. విస్తరిస్తోన్న చిలీ సింక్ హోల్..!
- PM Modi: ఆస్తులేవీ లేవు.. ఉన్న కాస్త స్థలాన్ని విరాళంగా ఇచ్చిన ప్రధాని!
- Vijay Deverakonda: బాబోయ్.. మార్కెట్లో మనోడి ఫాలోయింగ్‌కి ఇంటర్నెట్ షేక్
- Sita Ramam: బాలీవుడ్, టాలీవుడ్లో నాకు ఆ పరిస్థితే ఎదురైంది: రష్మిక
- Harmanpreet Kaur: ప్రతిసారి ఫైనల్స్‌లో మేం అదే తప్పు చేస్తున్నాం: హర్మన్‌ప్రీత్ కౌర్
- Railway ticket booking: 5 నిమిషాల ముందూ ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు..!
- దంపతుల మాయాజాలం.. తక్కువ ధరకే విమానం టిక్కెట్లు, ఐఫోన్లంటూ..