Jio 5G: ఏపీలోని మరో 9 పట్టణాల్లో జియో 5జీ సేవలు
Jio 5G in AP: ఏపీలోని మరిన్ని పట్టణాల్లో జియో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే ప్రధాన పట్టణాల్లో జియో సేవలు ప్రారంభం కాగా.. తాజాగా మరో 9 పట్టణాలు ఈ జాబితాలోకి చేరాయి.
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో (Jio 5g) తన 5జీ సేవలను దేశంలోని మరిన్ని నగరాలు/ పట్టణాలకు విస్తరించింది. నేటి నుంచి (మార్చి 21) మరో 16 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 41 నగరాలు/ పట్టణాల్లో ఈ సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా 406 నగరాలు/ పట్టణాల్లో జియో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చినట్లయ్యిందని పేర్కొంది. తాజాగా అందుబాటులోకి వచ్చిన 5జీ పట్టణాల్లో ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే 9 పట్టణాలు ఉన్నాయి.
ఏపీలోని ఆదోని, బద్వేల్, చిలకలూరిపేట, గుడివాడ, కదిరి, నరసాపురం, రాయచోటి, శ్రీకాళహస్తి, తాడేపల్లిగూడెం పట్టణాల్లో జియో 5జీ సేవలు ప్రారంభించినట్లు ఆ సంస్థ తెలిపింది. గతంలో విజయవాడ, విశాఖ, తిరుమల, తిరుపతి, రాజమహేంద్రవరం, చిత్తూరు, కడప, నరసారావుపేట, శ్రీకాకుళం, విజయనగరం, ఏలూరు, కాకినాడ, కర్నూలు, గుంటూరు తదితర నగరాలు/ పట్టణాల్లో ఇప్పటికే 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. జియో అందిస్తున్న 5జీ సేవలు అందుకోవడానికి 5జీ సపోర్ట్ కలిగిన హ్యాండ్‌సెట్ ఉంటే సరిపోతుంది. సిమ్ కార్డు మార్చాల్సిన అవసరం లేదు. జియో 5జీ వినియోగదారులు ఎలాంటి రుసుమూ చెల్లించకుండానే 1జీబీపీఎస్ వేగంతో అపరిమిత డేటాను వినియోగించుకోవచ్చని జియో పేర్కొంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Social look: అనసూయ బ్లూమింగ్.. తేజస్వి ఛార్మింగ్..
-
Sports News
Yashasvi Jaiswal: మైదానంలో నా ఆలోచనంతా అలానే ఉంటుంది: యశస్వి జైస్వాల్
-
India News
వీసాల్లో మార్పులు.. అండర్ గ్రాడ్యుయేట్లకు కాదు: యూకే మంత్రి
-
World News
Erdogan: జైలు నుంచి అధ్యక్షపీఠం వరకు.. ఎర్డోగాన్ రాజకీయ ప్రస్థానం..!
-
Politics News
AAP-Congress: ఆర్డినెన్స్‌పై పోరు.. ఆమ్ఆద్మీకి కాంగ్రెస్ మద్దతిచ్చేనా?
-
India News
అవినీతి ఆరోపణలు.. రోల్స్‌రాయిస్‌పై సీబీఐ కేసు