Jio Financial Services: ఎక్స్ఛేంజీల్లో జియో ఫైనాన్షియల్‌ లిస్టింగ్‌.. 5 శాతం డౌన్‌

Jio Financial trading: జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో లిస్టింగ్‌ అయ్యింది. ఆరంభంలో లాభాల్లో ప్రారంభమైన జియో ఫైనాన్షియల్‌.. తర్వాత లోయర్‌ సర్క్యూట్‌ను తాకింది.

Published : 21 Aug 2023 13:31 IST

దిల్లీ: ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నుంచి వేరుపడిన జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ (Jio Financial Services) స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్‌ అయ్యింది. జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ను ఆర్‌ఐఎల్‌ నుంచి గత నెలలో విభజించిన సంగతి తెలిసిందే. భారీ అంచనాలతో ఎంట్రీ ఇచ్చిన జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ బీఎస్‌ఈలో 1.20 శాతం లాభంతో రూ.265 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఎన్‌ఎస్‌ఈలో సైతం రూ.262 వద్ద ట్రేడింగ్‌ను మొదలు పెట్టింది. ఆ తర్వాత ఎన్‌ఎస్‌ఈలో 5 శాతం నష్టంతో లోయర్‌ సర్క్యూట్‌ను రూ.248.90 వద్ద తాకింది.

టెస్లా లీక్‌.. ఎలాన్‌మస్క్‌ సెక్యూరిటీ నంబర్‌ కూడా బహిర్గతం..!

జియో ఫైనాన్షియల్‌ షేరు విలువ నిర్ణయించేందుకు గత నెల ఆర్‌ఐఎల్‌ షేరుకు నిర్వహించిన ప్రత్యేక ట్రేడింగ్‌లో షేరు విలువను రూ.261.85గా కనుగొన్నారు. ఆ విలువతోనే ఎంట్రీ ఇచ్చిన జియో ఫైనాన్షియల్‌ షేరు ఆరంభంలో లాభాల్లో కొనసాగింది. ఈ క్రమంలో కంపెనీ మార్కెట్‌ విలువ రూ.1.59 లక్షల కోట్లకు చేరింది. 10 ట్రేడింగ్‌ రోజుల పాటు టీ గ్రూపు షేరుగా ఇది కొనసాగుతుంది. టీ గ్రూపు అంటే ట్రేడ్‌ టూ ట్రేడ్‌ షేర్లు. వీటిలో ఇంట్రాడే ట్రేడింగ్‌కు అనుమతి ఉండదు. ఈ షేర్లను ఈ రోజే కొని, ఈ రోజే విక్రయించలేం (బీటీఎస్‌టీ); ఈ రోజు అమ్మేసి రేపు కొనలేం (ఎస్‌టీబీటీ). ఈ షేర్ల విలువ తగ్గినా, పెరిగినా 5% సర్క్యూట్‌ పరిమితి ఉంటుంది. మరోవైపు స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని